సీఎం జగన్ ని రిక్వెస్ట్ చేసిన చిరంజీవి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

కాగా ప్రభుత్వం మాత్రం పెద్ద, చిన్న హీరో అనే తేడా లేకుండా.ఎవరికీ బెనిఫిట్ షో లేకుండా.

సినిమా టికెట్ల రేట్లు పెంచకుండా.సినిమా థియేటర్ కి వచ్చే ప్రేక్షకుడు జేబుకి చిల్లు పడకుండా.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు.తాజాగా సినిమా టికెట్ల రేట్లు విషయంలో.

ఏపీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై స్పందించారు.

సినిమా టికెట్ల రేట్లు విషయంలో దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలలో ఎటువంటి విధి విధానాలు ఉన్నాయో.

వాటిని ఏపీలో అమలు చేయాలని సీఎం జగన్ ని రిక్వెస్ట్ చేశారు.ఇండస్ట్రీ కోరిన విధంగా పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ బుకింగ్ విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే థియేటర్ మనుగడకోసం.

ఇండస్ట్రీ ని నమ్ముకొని బతుకుతున్న కుటుంబాల కోసం కాలానుగుణంగా సినిమా టికెట్ల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ ని చిరంజీవి రిక్వెస్ట్ చేశారు.

అంతమాత్రమే కాకుండా దేశం అంతటా ఒకే జీఎస్టీ ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తున్న నేపథ్యంలో.

టికెట్ ధర లో కూడా అదే వెసులుబాట్లు కల్పిస్తే సమన్యాయం చేసినట్లవుతుందని చిరంజీవి స్పష్టం చేశారు.

ప్రశాంత్ వర్మ ఒక్క పోస్ట్ తో జై హనుమాన్ సినిమా ఎలా ఉంటుందో చెప్పేశాడుగా..?