Megastar Chiranjeevi : ఆ రెండూ చిరంజీవి ఖాతాలోనే.. మెగా రికార్డ్

మెగాస్టార్ చిరంజీవితో( Megastar Chiranjeevi ) సినిమా చేయాలని ప్రతిఒక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్లతో పాటు నటీనటులకు ఉంటుంది.

దీంతో ఆయనతో సినిమా తీసేందుకు దర్శక, నిర్మాతలు పోటీ పడుతుంటారు.ఆయన ఇంటి ముందు క్యూ కడతారు.

చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే సినిమా ఇండస్ట్రీలో ఎవరూ వదిలిపెట్టుకోలేరు.చిరంజీవితో ఒక సినిమా చేస్తే చాలు.

దర్శక, నిర్మాతల క్రేజ్ పెరుగుతుంది.అంతేకాకుండా చిరంజీవికి ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఆయనతో సినిమా తీస్తే నిర్మాతలకు కాసుల పంటే.

అందుకే చిరంజీవితో సినిమా తీసేందుకు ఆయన డేట్లు కోసం తీవ్రంగా దర్శక, నిర్మాతలు పోటీ పడుతుంటారనే విషయం మనందరికీ తెలిసిందే.

"""/" / ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు తీస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు.

రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు.

2023 సంవత్సరంలో వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya ) సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు.

ఈ సినిమా సూపర్ హిట్ అయింది.మైత్రీ మూవీ మేకర్స్ ( Mythri Movie Makers )బ్యానర్ పై బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు భారీగానే లాభాలు వచ్చాయి.2023లో ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.

"""/" / అయితే 2023లో భోళాశంకర్( Bholashankar ) అనే సినిమాతో చిరంజీవి ప్రేక్షకులు ముందుకు రాగా.

ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.దీంతో డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలకి తీవ్ర నష్టాలు మిగిల్చింది.

దీంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు చిరంజీవి భవిష్యత్తులో న్యాయం చేస్తానని భరోసా ఇచ్చినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

దీంతో గత సంవత్సరంలో ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టిన సినిమాతో పాటు ఎక్కువ నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా కూడా చిరంజీవి ఖాతాలోనే ఉంటుంది.

ఈ సంవత్సరం కూడా మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు చిరంజీవి రెడీ అవుతున్నారు.

పలువురు దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు కథలు వినిపిస్తున్నారు.దీంతో ఈ ఏడాది కూడా మెగా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.

వారెవ్వా…నిజామాబాద్ లో దంపతుల హనీ ట్రాప్ దందా…!