రీమేక్‌ల తరువాత సాలిడ్‌గా ఇస్తానంటోన్న చిరు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో చిరు ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనే అంశం ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.

కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను ఓకే చేస్తూ తన స్పీడును చూపిస్తున్నాడు.

ఈ క్రమంలో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్‌లో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా తరువాత తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘వేదాళం’ను దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమాలు పూర్తయిన తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని సాలిడ్ డైరెక్టర్‌తో చేయాలని చిరు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు చిరు ప్లాన్ చేస్తున్నాడు.

అయితే క్లాస్, లేదా మాస్ చిత్రాన్ని తీసి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకోవాలని చిరు భావిస్తున్నాడు.

దీంతో ఈ ఇద్దరు డైరెక్టర్లలో చిరు ఎవరితో సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఆచార్య చిత్రంతో చిరు తన క్రేజ్‌ను మరోసారి నిరూపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిరు అండ్ టీమ్ చూస్తోంది.