పాన్ ఇండియాపై మెగాస్టార్ కి ఆసక్తి లేదా? ఫ్యాన్స్ ఆవేదన
TeluguStop.com
ఈ మధ్య కాలంలో చిన్న హీరోల నుండి స్టార్ హీరోల వరకు అంతా కూడా పాన్ ఇండియా సినిమా లపై పడుతున్నారు.
ఆ మధ్య తెలుగు లో విడుదల అయిన మీడియం రేంజ్.పెద్ద బడ్జెట్ సినిమా లన్నింటిని కూడా బాలీవుడ్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేశారు.
కొన్ని అక్కడ విడుదల అవ్వగా కొన్ని విడుదల ముందు అక్కడ బయ్యర్లు లభించక పోవడంతో రిలీజ్ అవ్వలేదు.
రిలీజ్ అయిన సినిమా ల్లో ఎక్కువ శాతం నిరాశనే మిగిల్చాయి అనే విషయం తెల్సిందే.
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా లను కూడా పాన్ ఇండియా సినిమా లు అంటూ ప్రచారం చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి.
"""/" / అలాంటిది మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) మాత్రం పాన్ ఇండియా సినిమా లు అంటే ఆసక్తి చూపడం లేదా అంటూ మెగా అభిమాను ల్లో చర్చ జరుగుతోంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన వాల్తేరు సినిమా( Walther Movie ) ను తెలుగు లో మాత్రమే విడుదల చేయడం జరిగింది.
అసలు హిందీ లో సినిమా ను విడుదల చేయాలి అనే ఆలోచన కూడా కలుగలేదా అంటూ కొందరు ప్రశ్నించారు.
ఆ విషయాన్ని పక్కన పెడితే స్టార్ హీరోలు చాలా మంది పాన్ ఇండియా లో సినిమా లు విడుదల చేస్తున్నారు.
కానీ చిరంజీవి తన ప్రస్తుత సినిమాను కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విడుదల చేసే ప్లాన్ చేస్తున్నాడు.
"""/" / విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవికి పాన్ ఇండియా సినిమా లు చేయాలి అనే ఆసక్తి బాగానే ఉంది.
కానీ ఇప్పటి వరకు తన వద్దకు వచ్చిన ఏ ఒక్క స్క్రిప్ట్ కూడా ఆశించిన స్థాయి లో పాన్ ఇండియా మార్కెట్ సినిమా అన్నట్లుగా అనిపించలేదట.
అందుకే అన్ని సినిమా లను కూడా తెలుగు మార్కెట్ వరకు మాత్రమే విడుదల చేయడం జరిగిందట.
మొత్తానికి పాన్ ఇండియా సినిమాను చేస్తాను కానీ ఇప్పుడు కాదు అంటూ చిరంజీవి తన ఫ్యాన్స్ కి మరియు సన్నిహితులకు ఇండస్ట్రీ వర్గాల వారికి చెబుతున్నాడు.
పంటి నొప్పికి కారణాలేంటి.. దాని నుంచి ఎలా రిలీఫ్ పొందొచ్చు..?