రేపటి మీటింగ్‌ చిరంజీవికి ఇష్టమేనా?

రేపటి మీటింగ్‌ చిరంజీవికి ఇష్టమేనా?

ఇటీవల టాలీవుడ్‌ పెద్దగా మెగాస్టార్‌ చిరంజీవి మారిపోయాడు.ఆ విషయాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు.

రేపటి మీటింగ్‌ చిరంజీవికి ఇష్టమేనా?

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీకి తనను ఆహ్వానించలేదు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడంతో చిరంజీవి ఆధిపత్యం ఆయన సహించలేక పోతున్నాడు, అందుకే బాలయ్య అలాంటి విమర్శలు చేశాడు అంటూ చాలా మంది డైరెక్ట్‌గానే అనేస్తున్నారు.

రేపటి మీటింగ్‌ చిరంజీవికి ఇష్టమేనా?

అసూయతోనే బాలయ్య ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడు అంటూ అంతా అనుకుంటున్నారు.బాలయ్య చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని తీవ్రంగా బాధించాయి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

అందుకే ఇకపై సినిమా పరిశ్రమకు చెందిన కార్యక్రమాలకు, ఇతర వివాదాలకు తాను దూరంగా ఉండాలని భావించాడట.

కాని తెలంగాణ సీఎంతో భేటీ అయ్యి ఏపీ సీఎంతో భేటీ కాకుంటే ఏపీ ప్రభుత్వం నుండి ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయేమో అనే ఉద్దేశ్యంతో కొందరి సలహా మేరకు ఏపీ సీఎం జగన్‌తో కూడా సినీ ప్రముఖులు హాజరు అయ్యేందుకు రెడీ అయ్యారు.

రేపు జగన్‌ నివాసంలో తెలుగు సినిమా ప్రముఖులు కలువబోతున్నారు.ఈ భేటీకి చిరంజీవి హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపలేదని అంటున్నారు.

మీడియాలో తన గురించి కొందరు చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం అన్నాడట.కాని ఆయన్ను బలవంతంగా ఒప్పించినట్లుగా తెలుస్తోంది.

కొందరు ప్రముఖులు ఒత్తిడి చేసి ఒప్పించినట్లుగా తెలుస్తోంది.జగన్‌తో భేటీ తర్వాత చిరంజీవి ఇలాంటి పెద్దరికపు పనులు నెత్తికి ఎత్తుకునే అవకాశం తక్కువ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైరల్ వీడియో.. అతి త్వరలో నీటిపై, రోడ్డుపై నడిచే వాహనాలు!

వైరల్ వీడియో.. అతి త్వరలో నీటిపై, రోడ్డుపై నడిచే వాహనాలు!