మెగాస్టార్ నెక్స్ట్ సినిమా నాగార్జున డైరెక్టర్ తో నేనా..?
TeluguStop.com
మెగా కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు మెగా ఫాన్స్ లో పూనకాలే .
ఇక మెగా హీరోల్లో ముఖ్యనగ మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi ) సినిమా అంటే ఇక మాటల్లో చెప్పనక్కర్లేదు ఫాన్స్ చేసే సందడి మాములుగా ఉండదు.
ఇప్పటికే చాల సినిమాలను లైన్లో పెట్టుకున్న చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కైవసం చేసుకున్నారు.
నిర్మాతలను కాసుల వర్షం కురిపించారు.ఇప్పుడు ఆగస్ట్ నెలలో బోళా శంకర్( Bola Shankar )తో థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయ్యారు.
దాదాపుగా 10 ఏళ్ళ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం( Meher Ramesh ) వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే, కీర్తి సురేష్ ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించనుంది.
తమిళంలో సూపర్ హిట్ కొట్టిన అజిత్ వేదాళం సినిమాకి ఇది తెలుగు రీమేక్ అని తెలుస్తుంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కేఎస్ రామారావు సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏంటని ఇంకా అఫీషియల్ అనౌన్స్ రానప్పిటికి అయన చేసే సినిమా ఇదే అంటూ.
పలనా డైరెక్టర్ తోనే సినిమా కన్ఫర్మ్ అయిందంటూ పుకార్లు మాత్రం తెగ షికార్లు చేస్తుంది.
"""/" /
ఇప్పటికే యంగ్ డైరెక్టర్స్ ఇద్దరు మ్గుగ్గురి స్క్రిప్ట్స్‌ను చిరు విన్నాడని , వారికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక భోళా శంకర్ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కాబట్టి ఎలాగూ ప్యాచ్ వర్క్ అంతా ఇదే నెలలోనే పూర్తి కాబోతుంది.
సో మెగాస్టార్ నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయటానికి సిద్దమవుతున్నారని , ఆయన ఇప్పటికే ఓ డైరెక్టర్‌ని ఫిక్స్ చేసేశారని తెలుస్తుంది.
"""/" /
సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ మూవీని కింగ్ నాగార్జునతో రెండు సినిమాలు చేసిన డైరెక్టర్‌తో చేయబోతున్నారని తెలుస్తుంది.
మరి ఎవరా డైరెక్టర్? అని ఆలోచిస్తున్నారా? అక్కినేని ఫ్యామిలీలో నాగార్జునతో సొగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు.
ఇక నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు చేసిన చేసిన కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ).
ఇక ఈ సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నీ కైవసం చేసుకున్నాయి.
ఇదే డైరెక్టర్ రవితేజతో ఆయన చేసిన నేల టిక్కెట్టు సినిమా మాత్రం డిజాస్టర్‌ని సొంతం చేసుకుంది.
ఇపుడు ఇదే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో మెగాస్టార్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందట.
అయితే ఈ సినిమాకు చిరు డాటర్ సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తుంది.
దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త మరొకటి వైరల్ అవుతోంది.
అదేంటంటే.చిరంజీవితో, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్( Trisha Krishnan ) నటించనుందట.
అయితే ఇది వరకే చిరు సరసం స్టాలిన్ చిత్రంలో త్రిష నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.
అయితే వీరిద్దరి కాంబోలో ఆచార్య సినిమా రావాల్సి ఉండగా , చివరి నిమిషంలో త్రిష పర్సనల్ కారణాలతో తప్పకుంది.
త్రిష ప్లేస్ లో కాజల్ చేసింది.అయితే ఇప్పుడు తాజాగా కళ్యాణ్ కృష్ణ , చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమాలో త్రిష జోడీ కట్టనుందని టాక్ వినిపిస్తోంది.
నా భార్యను ఈ గొడవలోకి లాగారు… ఎవరిని వదిలిపెట్టను: మంచు మనోజ్