బోయపాటితో మెగాస్టార్.. ఆ ఎఫక్టే అంటున్న ఫ్యాన్స్!

బోయపాటి శ్రీను అంటే ముందుగా గుర్తుకు వచ్చేది యాక్షన్.ఆయన తీసే యాక్షన్ సినిమాలకు మాస్ ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారు.

అయితే వరుసగా ఫ్లాప్స్ రావడంతో బోయపాటి స్టామినా గత కొద్దీ రోజులుగా తగ్గింది.

కానీ ఈ మధ్యనే వచ్చిన అఖండ సినిమాతో మరొకసారి బోయపాటి అఖండమైన విజయం సొంతం చేసుకోవడంతో మళ్ళీ ఈయన చుట్టూ స్టార్ హీరోలందరూ తిరుగుతున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆయన ను నమ్మి ఎవ్వరు ముందుకు రాలేదు.

స్టార్ హీరోలందరూ వెనకడుగు వేయడంతో బోయపాటి తన హిట్ కాంబో అయినా బాలయ్యను ఒప్పించి అఖండ సినిమాను తీసాడు.

వీరిద్దరికి ఇది హ్యాట్రిక్ సినిమా కావడంతో అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసారు.

ఇక ఈ సినిమా అనుకున్న దాని కంటే సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు స్టార్ హీరోలు మళ్ళీ బోయపాటి వెనుక పడుతున్నారు.

ఇప్పటికే చాలా మంది హీరోలు బోయపాటి నెక్స్ట్ లిస్టులో ఉన్నారు.ఇక ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు.

వినయ విధేయ రామ సినిమా సమయంలోనే చిరు ఆయనతో సినిమా తీయడానికి నేనెప్పుడూ రెడీ అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

"""/" / ఇక ఇప్పుడు అఖండ మాస్ జాతర చూసాక మెగాస్టార్ కూడా బోయపాటి తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

మరి ఈ విషయం నిజమైతే మాస్ కాంబినేషన్ కాంబో కి రంగం సిద్ధం అయినట్లే.

ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.మరి ఈ వార్త నిజమైన కూడా చిరు ప్రెజెంట్ నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.

ఇవి నాలుగు పూర్తి అయినా తర్వాతనే బోయపాటి సినిమా ఉండబోతుంది.

కేవలం ఈ రెండిటితో వైట్ అండ్ యూత్ ఫుల్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?