చిరంజీవి నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పాతాళ భైరవి మూవీ రీమేక్.. ఏం జరిగిందంటే?

గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో వినిపిస్తున్న పేరు నాగ్ అశ్విన్.

( Nag Ashwin ) కల్కి సినిమా( Kalki Movie ) ప్రమోషన్స్ నుంచి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు మారుమోగిపోతోంది.

ఆయన తాజాగా దర్శకత్వం వహించిన సినిమా కల్కి.ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ప్రతి ఒక్కరూ నాగ్ అశ్విన్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

అంతేకాకుండా ఈ సినిమాతో నాగ్‌ అశ్విన్‌ ఇప్పుడు ఇండియన్‌ టాప్‌ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు.

రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌, అట్లీ, సిద్ధార్థ్‌ ఆనంద్‌, సందీప్‌ రెడ్డి వంగా వంటి టాప్‌ కలెక్టెడ్‌ డైరెక్టర్‌ కేటగిరిలో చేరిపోపోయారు.

"""/" / ఆయన దర్శకత్వం వహించిన కల్కి సినిమా ఐదు రోజుల్లోనే ఈ సినిమా సుమారు ఆరు వందల కోట్ల గ్రాస్‌ సాధించడం విశేషం.

ఈ మూవీ ఈజీగా వెయ్యి కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సినిమా విడుదల అయ్యి దాదాపు వారం రోజులు కావస్తున్నా కూడా థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ సినిమాలకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.

చిరంజీవితో( Chiranjeevi ) సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది.నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉండబోతోంది అనే వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి.

"""/" / దీనికి సంబంధించిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.దీంతో ఈ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా అనే టాక్‌ ప్రారంభమైంది.

కాగా చిరంజీవి గతంలో మహానటి( Mahanati ) సినిమా సమయంలో నాగ్‌ అశ్విన్‌ ని టీం ని గొప్పగా ప్రశంసిస్తూ అభినందించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చిరు తన మనసులోని మాటని బయటపెట్టాడు.తనకు ఫోక్‌ లోర్‌ సినిమాలు చేయాలని ఉందని అన్నారు చిరు.

మాయలు, మంత్రాలు ఉండే చిత్రాలంటే తనకు ఇష్టం అని అలాంటి సినిమాలు చేయాలనుకున్నారట.

ఈ విషయాన్ని నాగ్ అశ్విన్‌ కి తెలిపారు.నాగ్‌ ఇలాంటి కథ రెడీ చేస్తే సినిమా చేసేందుకు రెడీ అన్నట్టుగా తెలిపారు చిరు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సినిమా ఫ్లాప్ అయినా వాణిశ్రీ కట్టిన ఆర్గాండి వాయిల్ చీరలు ఫుల్ ఫేమస్