విడుదల అయ్యాక బ్యాన్ అయిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా.. ?
TeluguStop.com

మనోభావాలు దెబ్బతిన్నాయి అని మీడియాకు ఎక్కడం కొంత కాలంగా కామన్ అయ్యింది.ఈ ఇబ్బందులను అధికంగా ఎదుర్కొంటున్నవి సినిమాలు అని చెప్పుకోవచ్చు.


పలు సినిమాలు విడుదల అయ్యాక.ఆయా వర్గాలు, లేదంటే కులాలు.


లేదంటే స్త్రీలను కించపరిచేలా ఉన్నాయంటూ నానా రచ్చ చేస్తున్నారు కొందరు జనాలు.సేమ్ ఇలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాపై తెగ ఆందోళనలు జరిగాయి.
మహిళా సంఘాలు రోడ్డెక్కి కొట్లాటకు దిగాయి.ఇంతకీ ఈ సినిమా వివాదానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చిరంజీవి హీరోగా ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో అల్లుడా మజాకా అనే సినిమా తెరకెక్కింది.
ఆ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.కానీ ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ మహిళా సంఘాలు రోడ్డెక్కాయి.
పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి.నిజానికి సినిమా చూసిన తర్వాతనే విడుదలకు అంగీకారం చెప్పిన సెన్సార్ బోర్టు.
మూవీ విడుదలయ్యాక రెండు నెలలకు నిషేధం విధించడం సంచలనం అయ్యింది.అటు సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిరంజీవి ఫ్యాన్స్ ఆందోళన బాటపట్టారు.
అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టారు.ఈ దెబ్బతో సెన్సార్ బోర్టు వెనక్కి తగ్గింది.
అభ్యంతర కర సీన్లు తొలగించి సినిమా విడుదల చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. """/"/
దీంతో అప్పటి వరకు చెలరేగిన ఆందోళనలు సర్దుమణిగాయి.
ఈ సినిమా తొలి వారంలోనే 3 కోట్ల 75 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.
ఈ సినిమా మొత్తంగా 12 కోట్ల రూపాయలు వసూలు చేసి కొత్త రికార్డు అందుకుంది.
27 సెంటర్లలో 100 రోజులు ఆడింది.ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు.
వేటూరి, భువనచంద్ర పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.ఈ సినిమాలోని పాటలన్నీ జనాల నోళ్లలో నానాయి.
మొత్తంగా చిరంజీవి సినీ కెరీర్ లో ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి సరికొత్త రికార్డులను కొల్లకొట్టింది.
ఆందోళనల నుంచి మొదలై ఘన విజయం వరకు ఈ సినిమా ప్రస్థానం కొనసాగడం విశేషం.
నెల రోజులు ఈ క్రీమ్ ను వాడితే మీకు మేకప్ అవసరమే ఉండదు!