చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కష్టమే

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం లో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్లే అంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు అని.

సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఇంకా బ్యాలన్స్ ఉంచారని.కొన్ని కారణాల వల్ల ఆ సన్నివేశాలను చివర్లో చేయాలి అనుకున్నారు.

ఆ సన్నివేశాలకు కాస్త ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు.ఆగస్టు లో సినిమా కు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.

కాని ఆ సన్నివేశాలను ఎప్పటి వరకు పూర్తి చేసేది క్లారిటీ లేదు.అందుకే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో మళ్లీ సస్పెన్స్ నెలకొంది.

చిరంజీవి చాలా స్పీడ్‌ గా ఉన్నా కూడా పరిస్థితులు సహకరించక పోవడం వల్ల సినిమా ను ఈ దసరా కు విడుదల చేయడం సాధ్యం అయ్యేలా లేదు అంటూ యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

సినిమా ను భారీ ఎత్తున ఎన్వీ ప్రసాద్‌ మరియు చరణ్‌ లు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా మలయాళ సూపర్ హిట్‌ చిత్రం లూసీఫర్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే.

ఆ సినిమా మెయిన్‌ కథ ను తీసుకుని స్క్రీన్‌ ప్లే మొత్తం ను మార్చేస్తున్నారు.

సినిమా లో నయనతార కీలక పాత్రలో కనిపించబోతుంది.ఇంకా ఈ సినిమా లో సల్మాన్ ఖాన్‌.

పూరి జగన్నాద్‌.సత్యదేవ్‌ ఇంకా పలువురు ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు.

సినిమా ను పూర్తిగా కమర్షియల్‌ గా మార్చే క్రమంలో దర్శకుడు మోహన్ రాజా సినిమా ను ఆలస్యం చేశాడు అనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

 చిరంజీవి గాడ్‌ ఫాదర్ విడుదల ఆలస్యం అయితే వాల్తేరు వీరన్న మరియు భోళా శంకర్ సినిమాలు కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.