ఏపీ ముఖ్యమంత్రితో చిరంజీవి భేటీ...స్పందించిన నాగార్జున..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య టిక్కెట్ల రేట్లపై యుద్ధం జరుగుతూనే ఉంది.

ఏపీ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం సినిమా రేట్లను తగ్గించడంతో ఎంతో మంది సినీ కార్మికులు నష్టపోతారని సినీ ప్రముఖులు ఈ విషయంపై మరొకసారి ఆలోచించాలని ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.

అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఇలా సినీ ప్రముఖులు చేసిన విమర్శలకు దీటుగా ఏపీ మంత్రులు సైతం కౌంటర్ ఇస్తున్నారు.

ఇలా గత కొన్ని రోజుల నుంచి ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు చిరంజీవికి అపాయింట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే జగన్ తో నేడు చిరంజీవి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సీఎంతో చిరంజీవి భేటీ గురించి నాగార్జున స్పందించారు.

"""/" / ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇచ్చిన విషయాన్ని చిరంజీవి వారం క్రితమే తనకు చెప్పారని నేను కూడా కలిసి ఇండస్ట్రీ సమస్యలను వివరించాలని.

ఏదో ఒకటి చేసేసి రండి అని చెప్పానని నాగార్జున తెలిపారు.ఎవరు ఏం చెప్పినా.

ఏం చేసినా ఇండస్ట్రీ కోసమేనని నాగార్జున ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక తన సినిమా విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాకు బడ్జెట్ నిర్ణయించుకున్నామని అందుకే ప్రస్తుతం ఉన్న రేట్లలో కూడా తమ సినిమా సేఫ్ జోన్ లోనే ఉంటుందని నాగార్జున తెలిపారు.

నిజ్జర్ హత్య కేసు : కెనడా పోలీసుల అదుపులో ముగ్గురు భారతీయులు