ఆ ఇద్దరూ నాకు గురు సమానులు.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా కోసం ఏకంగా 13 సెట్లు వేస్తున్నారని సమాచారం అందుతోంది.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం మంచి ఛాన్స్ అని చెప్పుకొచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారని వీళ్లిద్దరూ తనకు ఎన్నో మంచి సలహాలు ఇచ్చారని చిరంజీవి కామెంట్లు చేశారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్( NTR, ANR ) లను దైవ సమానులని చిరంజీవి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరోవైపు విశ్వంభర సినిమాతో చిరంజీవి బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
చిరంజీవి పారితోషికం ప్రస్తుతం 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.
చిరంజీవి సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు సైతం భారీ మొత్తాన్ని అమ్ముడవుతున్నాయి. """/" /
చిరంజీవి వయస్సు పెరుగుతున్నా మెగాస్టార్ తన ఎనర్జీ లెవెల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
చిరంజీవి మాట్లాడుతూ తాను స్టార్ గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.
యండమూరి ( Yandamuri )మేధా సంపత్తి నుంచి వచ్చిన పాత్రలే నా కెరీర్ కు సోపానాలు అయ్యాయని చిరంజీవి వెల్లడించారు.
యండమూరి సినిమాల వల్లే నాకు మెగాస్టార్ బిరుదు వచ్చిందని చిరంజీవి పేర్కొన్నారు. """/" /
యండమూరి నా బయోగ్రఫీ రాస్తాననడం నిజంగా సంతోషంగా ఉందని చిరంజీవి కామెంట్లు చేశారు.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ( Yarlagadda Lakshmi Prasad )నా చిరకాల మిత్రులని చిరంజీవి పేర్కొన్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని చిరంజీవి అన్నారు.చిరంజీవి వెల్లడించిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
చిరంజివీ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
వ్యూహం అదిరింది బాబాయ్ .. !