మెగా 154 షూటింగ్ లో గాయపడిన చిరంజీవి... లెక్కచేయకుండా షూటింగ్ లో మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే వరుస సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్నారు.ఇప్పటికే గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమా షూటింగులతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు.

ఈ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ పై బిజీగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.

ఈ క్రమంలోనే గత వారం ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.

సాధారణంగా ఇలాంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలంటే హీరోలకు బదులుగా డూప్ సహాయంతో అలాంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

కానీ ఎలాంటి డూప్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ సన్నివేశాలలో పాల్గొన్నారు.ఈ సన్నివేశాల షూటింగ్ లో భాగంగా ఏనుగు పై చిరంజీవి సవారీ చేయాల్సి వచ్చింది.

అయితే ఏనుగు పై నుంచి కిందికి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా చిరంజీవి కాలు బెనకడంతో కింద పడ్డారని తెలుస్తోంది.

"""/"/ ఇలా కాలు బెనకడంతో మెగాస్టార్ షూటింగ్ నుంచి విరామం తీసుకోకుండా సినిమా కోసం ఇచ్చిన కాల్షీట్స్ వృధాగా మారిపోతాయని పట్టుబట్టి ఆ రోజు మొత్తం షూటింగ్లో పాల్గొన్నారు.

తనవల్ల ఆ రోజు షూటింగ్ ప్లాన్ డిస్ట్రబ్ కాకుండా నిర్మాతలు నష్ట పోకుండా ఉండటం కోసం మెగాస్టార్ నొప్పిని భరిస్తూ షూటింగ్లో పాల్గొన్నారు.

సినిమా పట్ల ఇలాంటి అంకితభావం ఉండటంతోనే నేడు ఆయన మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహ పడాల్సిన పనిలేదు.

నా కూతుర్ల కోసం పోరాటం చేయాల్సి వస్తోంది.. ఎమోషనల్ అయినా తారకరత్న వైఫ్!