చిరు గాడ్ ఫాదర్ రిలీజ్ అప్డేట్ వచ్చేది ఎప్పుడు భయ్యా!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదల తేదీ విషయం లో కన్ఫ్యూజన్ నెలకొంది.
మోహన్ రాజా దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ కి రీమేక్ అనే విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందిన లూసీఫర్ సినిమా కి సంబంధించిన వసూళ్లు అప్పట్లో కేరళ లో సంచలనం సృష్టించాయి.
అంతటి భారీ వసూళ్లు మళ్లీ ఇప్పుడు గాడ్ ఫాదర్ కి సాధ్యం అంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా బలంగా నమ్ముతున్నారు.
అందుకే మెగా ఫ్యాన్స్ లో మెజార్టీ జనాలు గాడ్ ఫాదర్ విడుదల అయితే చిరంజీవి జోరు మళ్లీ చూపించినట్లు అవుతుంది అంటూ ధీమా తో ఉన్నారు.
అందుకే విడుదల తేదీ విషయం లో చాలా ఆసక్తిగా ఉన్నారు.రేపు చిరంజీవి బర్త్ డే .
ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా టీజర్ ను విడుదల చేయడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.
"""/" /
సినిమా యొక్క విడుదల తేదీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
టీజర్ లో సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని అంతా నమ్ముతున్నారు.
తప్పకుండా భారీ ఎత్తున చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సోషల్ మీడియా లో చిరు బర్త్ డే సందర్బంగా గాడ్ ఫాదర్ సినిమా సందడి కనిపించబోతుంది.
ఒక వేళ టీజర్ లో కనుక గాడ్ ఫాదర్ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించకుంటే అప్పుడు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆందోళన చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గాడ్ ఫాదర్ సినిమా లో నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే.ఆమె మాత్రమే కాకుండా సల్మాన్ ఖాన్.
పూరి లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.సల్మాన్ ఖాన్ పాత్ర సినిమా కు హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.
ఆ ఒక్కరు తప్ప మిగతా కంటెస్టెంట్లు వేస్ట్.. 12 మంది తీసుకురావడమే బెటర్..?