చిరంజీవి తొలి బాలీవుడ్ చిత్రం ఏదో తెలుసా?

చిరంజీవి అంటేనే ఓ ట్రెండ్ సెట్ట‌ర్.ఆ పేరు వింటేనే ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్స్.

చిన్న చిన్న క్యార‌క్ట‌ర్ల నుంచి స్వ‌యం కృషి తో హీరోగా ఎదిగారు.సినీజ‌గత్తును 43ఏళ్ల నుంచి ఏక‌చ‌క్రాధిప‌త్యంగా జాతీయ‌, నంది అవార్డ్ ల‌తో పాటు ఏడు ఫిల్మిం ఫేర్ అవార్డ్ ల‌ను అందుకున్న మెగా ధీరుడు.

1978లో అంటే ఈ ఏడాదితో స‌రిగ్గా 43 ఏళ్లు కే.వాసు డైర‌క్ష‌న్ లో కాంత్రికుమార్ నిర్మాత‌గా ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో న‌ర్స‌య్య పాత్ర‌తో చిరంజీవి వెండితెరకు పరిచయం అయ్యాడు.

1978 నాటి నుంచి నేటి వ‌ర‌కు క‌ళామాత‌ల్లి గ‌ర్వించ ‌ద‌గ్గ ముద్ధుబిడ్డ‌గా అంచెలంచ‌లుగా ఎదుగుతూ ఎంతో మందికి ఆద‌ర్శ ప్రాయుల‌య్యారు.

సినిమా కోసం ప‌రిత‌పించే నిరంత‌ర శ్రామికుడు, అనిత‌ర సాధ‌కుడు, త‌న సినిమాల‌తో తెలుగు ఇమేజ్ ను విశ్వ‌వ్యాప్తంగా చాటిచెప్పి.

శతాబ్ధాలు దాటుతున్నా చిరంజీవి వేవ్ ఇప్ప‌టికీ.ఎప్ప‌టికీ ఇలాగే కొన‌సాగుతుంది.

ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టి త‌న సినీ జీవిత ‌ప్ర‌స్థానాన్ని విశ్వవ్యాప్తం చేసినా తాను ఓ కానిస్టేబుల్ కొడుకుగానే ఇష్ట‌ప‌డ‌తారు.

మొహానికి రంగేసుకోవాల‌నుకున్న ప్ర‌తీ ఒక్క‌రు ఆయ‌న వేసిన పూల‌బాటలోనే న‌డుస్తూ త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకుంటున్నారు.

1978లో వ‌చ్చిన ప్రాణం ఖరీదు నుంచి 2017లో వ‌చ్చిన ఖైదీ 150 వ‌ర‌కు ఎన్నో విజయాలను అందుకున్నాడు చిరు.

అయితే మెగ‌స్టార్ చిరంజీవి తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్ చిత్రాలలో కూడా స‌త్తా చాటారు.

ముఖ్యంగా హిందీలో.1990లో హిందీలో యాక్ట్ చేసిన త‌న తొలి చిత్రం ప్ర‌తిబంధ్.

తెలుగు సినిమా అకుంశం రీమేక్ తో వ‌చ్చిన ప్ర‌తిబంధ్ తో సూప‌ర్ హిట్ కొట్టారు.

ఆ త‌రువాత ఆజ్ కా గూండా రాజ్, ది జెంటిల్ మేనే అనే చిత్రాల్లో న‌టించారు.

కానీ బాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌స్తున్న త‌న సినీ జీవితాన్ని టాలీవుడ్ కే అంకితం చేశారు చిరు.

ఇక ప్ర‌స్తుతం మెగ‌స్టార్ కొర‌టాల శివ‌ డైర‌క్ష‌న్ లో ఆచార్య సినిమాలో యాక్ట్ చేస్తున్నారు.

సీమతో పాటు ఆ జిల్లాల ప్రజలే వైసీపీని గెలిపించనున్నారా.. అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందా?