అల్లు అర్జున్‌ మల్టీప్లెక్స్ ని మెగా ఫ్యాన్స్ బాయ్‌కాట్‌ చేయాల్సిందే!

గత కొంత కాలంగా అల్లు అర్జున్( Allu Arjun ) పై మెగా ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు అనే విషయం అందరికి తెల్సిందే.

మెగా ఫ్యామిలీ అనే బ్రాండ్‌ ఇమేజ్ ను వద్దు అనుకుంటున్న అల్లు అర్జున్ మెగా హీరో అంటూ కొందరు పిలిస్తే ఒప్పుకోవడం లేదు.

తాజాగా అల్లు అర్జున్‌ చేసిన పని తో చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అల్లు అర్జున్‌ అమీర్ పేట్ లో సత్యం థియేటర్‌( Satyam Theatre ) ప్లేస్ లో ఏఏఏ సినిమాస్ అనే మల్టీ ప్లెక్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

ఆ మల్టీ ప్లెక్స్ ఓపెనింగ్ నిన్న జరిగింది. """/" / నేడు ఆదిపురుష్‌ సినిమాను స్క్రీనింగ్‌ చేస్తున్నారు.

నిన్న మల్టీ ప్లెక్స్‌ ఓపెన్‌ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫోటోలు మరియు హోర్డింగ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

అల్లు ఫ్యామిలీ ఫోటోలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి.అంతే కాకుండా అల్లు స్నేహారెడ్డి యొక్క పెద్ద ఫోటోను కూడా అక్కడ పెట్టారు.

అంతగా అల్లు అర్జున్‌ ఫోటో గ్యాలరీ ని ఏర్పాటు చేయడం జరిగింది.ఆ ఫోటో గ్యాలరీ లో ఒక్కటి అంటే ఒక్క ఫోటో కూడా చిరంజీవి ది లేకపోవడం మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది.

ఇలాంటి మల్టీప్లెక్స్ కు మేము రావాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ అంతా బన్నీ మల్టీ ప్లెక్స్( Bunny Multiplex ) ను బాయ్‌కాట్‌ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.

చిరంజీవి ప్రారంభించిన బ్లడ్‌ బ్యాంక్ ఆఫీస్ లో అల్లు రామలింగయ్య ఫోటోలు ప్రధానంగా ఉంటాయి.

"""/" / కానీ బన్నీ మల్టీ ప్లెక్స్ లో మాత్రం చిరు ప్రస్థావన లేకపోవడం ను ఎలా చూడాలి అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఇది ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు విమర్శిస్తున్నారు.అల్లు అర్జున్‌ కు మద్దతుగా నిలిచే వారు కూడా ఉన్నారు.

అయితే కుటుంబ పెద్ద హోదాలో అయినా చిరంజీవికి గౌరవం ఇచ్చి ఒక ఫోటో పెడితే బాగుండేది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదెలా సాధ్యం బాస్.. కర్చీఫ్ ను అలా ఎలా పాములా మార్చేసావ్?