కొడాలి నానికి మాస్ వార్నింగ్ ఇస్తున్న చిరంజీవి ఫ్యాన్స్.. మెగాస్టార్ చెప్పిన మాటల్లో తప్పేంటంటూ?
TeluguStop.com
భోళా శంకర్( Bhola Shankar ) మూవీ రిలీజ్ ముంగిట చిరంజీవి ఏపీ ప్రభుత్వం గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు, మెగా అభిమానులు రెండుగా చీలిపోయారు.పకోడీగాళ్లు అంటూ కొడాలి నాని( Kodali Nani ) చేసిన విమర్శలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
అయితే చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం కొడాలి నానికి మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. """/" /
వైసీపీ చిరంజీవి( Chiranjeevi )ని టార్గెట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి రాజకీయాల్లో లేకపోతే రాజకీయ అంశాల గురించి స్పందించకూడదా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సొంత తమ్మునిపై వైసీపీ నేతలు ఇష్టానుసారం కామెంట్లు చేస్తే చిరంజీవి చేతులు కట్టుకుని కూర్చోవాలా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ నేతలు చిన్నచిన్న విషయాలను పెద్దది చేయవద్దని మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.టికెట్ రేట్లు తగ్గించి సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టడం వల్లే ప్రస్తుతం వైసీపీ నేతలపై సినిమా హీరోలు కామెంట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది.
వైసీపీ నేతలు హద్దులు దాటి విమర్శలు చేయడం వల్ల రివర్స్ లో అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.
చిరంజీవి వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు గతంలో వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారని ఈ సందర్భంగా మెగా అభిమానులు గుర్తు చేస్తున్నారు.
"""/" /
స్వయంకృషితో ఎంతో కష్టపడి మెగాస్టార్ పైకి ఎదిగారని ఆయనను కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య దూరం ఇప్పటికే పెరిగిందని ఆ దూరాన్ని మరింత పెంచుకోవద్దని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కొడాలి నాని ఇదే విధంగా ట్రోల్స్ చేస్తే మేము కూడా ఆయన భాషలోనే బదులిస్తామని చెబుతూ మెగా ఫ్యాన్స్ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు.
దిష్టి మొత్తం పోయింది బాబాయ్.. అల్లు అర్జున్ అరెస్టుపై మనోజ్ కామెంట్స్!