పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లిన చిరు అభిమాని.. ఈ అభిమానానికి ఫిదా అవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )అంటే అభిమానులు ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా చిరంజీవి అభిమాని ఒకరు తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకొని వార్తల్లో నిలిచారు.

పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లిన చిరు అభిమాని గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

చిరంజీవి తాజాగా తన 69వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే.తిరుమల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి చిరంజీవిపై వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నారు.

శ్రీవారి మెట్టు మార్గం గుండా ఆ అభిమాని పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లి వార్తల్లో నిలిచారు.

రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ చిన్నప్పటి నుంచి చిరంజీవికి వీరాభిమాని అని తెలుస్తోంది.

గత 21 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ అభిమాని పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

"""/" / చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీవారిని ఆ వ్యక్తి కోరుకున్నారని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ను సీఎంగా చూడాలని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

మెగా హీరోలపై ఇంత అభిమానాన్ని చాటుకునే హీరోలు మాత్రం అరుదుగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

"""/" / చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో( Vishwambhara ) నటిస్తుండగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

200 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మల్లిడి వశిష్ట ఈ సినిమా టీజర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ మాత్రం ప్రేక్షకులను మెప్పించింది.చిరంజీవికి మాత్రమే ఇలాంటి అభిమానులు ఉంటారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

సింగపూర్ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా భారత్‌కు .. ఎవరీ థర్మన్ షణ్ముగరత్నం?