Producer Skn : చిరంజీవిని పొగుడుతూ రోజా, జీవిత రాజశేఖర్ కు చురకలు అంటించిన బేబీ నిర్మాత?

ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య కలిసి నటించిన బేబీ సినిమా( Baby Movie ) విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరు మారుమోగిపోతోంది.కాగా ఈ సినిమా ఆశించిన దానికంటే రెట్టింపు కలెక్షన్స్ ని సాధించడంతో పాటు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుండడంతో చిత్ర బృందం వరుసగా సక్సెస్ మీట్ లను నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా బేబీ టీం మెగా కల్ట్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఆ ఈవెంట్ కి ఈ ముఖ్య అతిథిగా మెగాస్టార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్కేఎన్ చిరంజీవి గొప్పతనం గురించి స్పందిస్తూ పొగడ్తల వర్షం కురిపించారు.

"""/" / కాగా ఈ చిత్ర నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయిరాజేష్ మెగాస్టార్( Chiranjeevi ) వీరాభిమానులు తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ ఈవెంట్ లో భాగంగా నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.బాస్ అంటే మంచితనం.

ఎందుకంటే బాస్‌ను విమర్శించిన వాళ్లు ఒక మూడు నెలల తరవాత వచ్చి బాస్ దగ్గర ఒక హెల్ప్ తీసుకుంటారు.

బొకే ఇచ్చి ఆయనతో ఫొటో తీసుకుంటారు.కానీ వాళ్లను ఆయన ఏమీ అనరు.

మంచితనానికి ఎవరెస్ట్ ఉంటే.ఆ ఎవరెస్ట్ మెగాస్టార్.

బాస్‌ను కామెంట్ చేస్తారుం.ఆయన ఫ్యామిలీని కామెంట్ చేస్తారు.

ఆ తరవాత సైలెంట్‌గా వచ్చి బాస్‌తో ఫొటో దిగేస్తారు. """/" / అప్పుడప్పుడు అనుకుంటా బాస్‌లో ఈ మంచితనం ఏంటి అని.

బాస్ ఎంతో ఉన్నత ఆశయాలతో స్థాపించిన బ్లడ్ బ్యాంక్‌పై కూడా కొంతమంది కామెంట్ చేశారు.

ఒక పదేళ్ల తరవాత వాళ్లకు ఇప్పుడు జైలు శిక్ష విధించారు.కానీ, ఇన్నాళ్లూ గుండె రగిలిపోయిన, రక్తం మరిగిపోయిన నాలాంటి అభిమానులకు ఏంటిది? అంటే మనకు మీడియా లేదు.

బాస్ ఇంట్లో రేడియో ఉంది కానీ.మీడియా లేదు.

అందుకే బాస్ మీద ఏదైనా నెగిటివ్‌గా వస్తే బ్రేకింగ్ వస్తుంది.బాస్ ఏదైనా మంచిపని చేస్తే స్క్రోలింగ్ వస్తుంది.

రోజులు మారాయి బాస్.సోషల్ మీడియా( Social Media ) వచ్చింది.

ఫ్యాన్స్ అందరూ ఎడ్యుకేట్ అయ్యాం.ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి.

నా చిన్నప్పుడు సోషల్ మీడియా లేదు.టన్నుల్లో ఉన్న బాస్ క్రేజ్‌ని ఇన్‌స్టాలోని గ్రాములు కొలవగలవా? ఆయన ఫేస్ వేల్యూని కొలిచే ఫేస్‌బుక్ ఉందా? ట్వీట్స్‌కు తెలుసా ఆయన సక్సెస్ రూట్స్? సోషల్ మీడియాకు తెలియని సైంటిఫిక్ మిరాకిల్ ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అంటే చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఇన్ డైరెక్టుగా హీరోయిన్ రోజా అలాగే జీవిత రాజశేఖర్ లకు చురకలు అంటించారు.

కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?