Sushmita Konidela : కూతురు వల్ల ఆ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న చిరంజీవి.. ఇకనైనా మారాలంటూ?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈయన బింబిసార డైరెక్టర్ వశిష్ట ( Mallidi Vasishta ) దర్శకత్వంలో తన కొత్త సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది ఇక చిరంజీవి 156వ సినిమా అని కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna )దర్శకత్వంలో చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడటంతో ఆ సినిమా స్థానంలో వశిష్ట దర్శకత్వంలో చేస్తున్నటువంటి సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారు ఈ క్రమంలోనే పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు.

"""/" / ఇక ఈ సినిమా షూటింగ్ పనుల్లో ప్రారంభం కాబోతున్నాయి అనే విషయం తెలియడంతో మెగా అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఒక విషయంలో మాత్రం అభిమానులు ఏమాత్రం సంతోషం లేరని తెలుస్తుంది ఈ సినిమాలో కొంతమంది టెక్నీషియన్స్ భాగం కావడం మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు ముఖ్యంగా మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల ( Sushmitha Konidela ) విషయంలో అభిమానులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలన్నింటికీ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా సుస్మిత పనిచేస్తున్నారు.

అయితే సుస్మిత తన డిజైనింగ్ ద్వారా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారని తెలుస్తోంది. """/" / మెగాస్టార్ చిరంజీవిని ట్రెండీ లుక్ లో చూపించడంలో సుస్మిత పూర్తిగా విఫలమవుతున్నారని తనని చాలా ఓల్డ్ లుక్ ద్వారానే ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారని అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విషయంలో సుస్మిత కూడా తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.

అయితే తిరిగి ఈ సినిమాకి కూడా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ కావడంతో తీవ్రస్థాయిలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలే చిరంజీవి ఈ సినిమా సోసియో ఫాంటసీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు.

ఇలా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాలో సుస్మిత కాకుండా ఆమె స్థానంలో ప్రముఖ డిజైనర్స్ ను తీసుకుంటే బాగుండేది అంటు కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఫోటోగ్రాఫర్ చోటా కె నాయుడు( Chota K Naidu ) విషయంలో కూడా మెగా అభిమానులు సంతృప్తిగా లేరని తెలుస్తోంది.

చోటా కె నాయుడు స్థానంలో ఇతర ఫోటోగ్రాఫర్లు ఉంటే బాగుండేది అంటూ ఈ సినిమా విషయంలో అభిమానులు తమ నిర్ణయాలను తెలియజేస్తున్నారు.

ఇప్పటికైనా చిరంజీవి తన కూతురిపట్ల ఉన్న ప్రేమను పక్కనపెట్టి సినిమాలపరంగా ఆలోచించి ఆమె స్థానంలో మరొకరిని కాస్ట్యూమ్ డిజైనర్ గా నియమించుకుంటే బాగుంటుంది అంటూ కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

సాయిపల్లవి యాక్టింగ్ తో తండేల్ రికార్డులు క్రియేట్ చేయడం పక్కా.. ఏం జరిగిందంటే?