భక్తి, ఆధ్యాత్మికత మధ్య డిఫరెన్స్ చెప్పిన మెగాస్టార్

భక్తి, ఆధ్యాత్మికత అనేది ఒకే రకంగా కనిపించే రెండు భిన్నమైన అభిప్రాయలు.భక్తి భావన ఉన్న ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలని లేదు.

అయితే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లే వారికి కచ్చితంగా భక్తి ఉండాలి.ఈ రెండింటికి ఒకే విధంగా చాలా మంది చూస్తారు.

అయితే భక్తి, ఆధ్యాత్మిక భావనలు అనే వాటికి ఉన్న వ్యత్యాసం గురించి మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

నా ఉద్దేశంలో భ‌క్తి, ఆధ్యాత్మిక ఒక‌టి కాదు.సాధార‌ణంగా మ‌నుషుల జీవితంలో ముందుగా భ‌క్తి గురించి భావ‌న వ‌స్తుంది.

ఆ త‌ర్వాత క్ర‌మంగా మ‌నుషులు ఆధ్యాత్మికం వైపు ప్ర‌య‌ణిస్తారు.నాకు ఆంజ‌నేయ స్వామి అంటే ఇష్టం.

ఎంత ఇష్టమంటే, ఆయ‌న మాట్లాడాల‌ని అనుకునేతంగా.ఒకానొక ద‌శ‌లో నాకు ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఆయ‌న‌తో చెప్పుకునేవాడిని.

త‌ర్వాత క్ర‌మంగా ఆంజ‌నేయ‌స్వామి ఎక్క‌డో లేడు.నాలో ఆంత‌ర్గ‌తంగా ఉన్నాడ‌ని అర్థ‌మైంది.

సాధార‌ణంగా మ‌నం స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేట‌ప్పుడు మ‌న‌కు ధైర్యం కావాలి.ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడే దేవుడు.

ఆ దేవుడడు ఎక్క‌డో లేడు.మ‌న‌లోనే ఉన్నాడనే భావనని కలిగి ఉండటాన్ని భక్తి భావన భావించాలి.

అయితే పూర్తిగా ఈ భౌతిక బంధాలని దైవ స్మరణలో ప్రయాణంలో చేయడం అనేది ఆధ్యాత్మికత క్రింద వస్తుంది.

ఈ రెండు సారూప్యత ఒకే విధంగా ఉన్న కొద్దిగా భిన్నమైన అభిప్రాయాలు అని చిరంజీవి ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే భక్తి, దైవం కాన్సెప్ట్ తోనే ఇప్పుడు చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.

దైవాన్ని, దేవాలయాలని కబ్జా చేయాలని అనుకునే మాఫియాతో చిరంజీవి చేసే పోరాటంగా ఆచార్య సినిమా ఉండబోతుందని తాజాగా రిలీజ్ అయినా టీజర్ బట్టి అర్ధమవుతుంది.

Viral Video : వీడియో: గర్ల్స్ హాస్టల్‌లోకి దూరిన యువకుడు.. అడ్డంగా బుక్కయ్యాడు..