సలాం వెంకీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇతర సినిమాలను కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు.

ఇలా కొత్తగా విడుదలైన సినిమాల గురించి ఈయన స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చిత్రం బృందానికి అభినందనలు తెలియజేయడమే కాకుండా కొత్త వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రలో నటించిన సలాం వెంకీ సినిమా డిసెంబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇలా డిసెంబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ చిత్రంలో కాజోల్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలు పోషించారు.తన కొడుకు చివరి కోరికను నిజం చేయడం ఓ తల్లి పడే ఆరాటమే సలాం వెంకీ.

తాజాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నటి రేవతి పై ప్రశంసలు కురిపించారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ నటనను… అమీర్ ఖాన్ పై మెగాస్టార్ ప్రశంసలతో ముంచేత్తారు.

"""/"/ ఇలాంటి సాహసోపేతమైన కథలతో దర్శకులకు.లేడీ డైరెక్టర్స్‏ కు మరింత స్పూర్తినిస్తూనే ఉంటారని చిరు వెల్లడించారు.

ఈ సినిమా నిర్మించడంలో విధానానికి నా అభినందనలు.ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు నా మిత్రుడికి అభినందనలు.

నేను నా నిజ జీవితంలో వెంకీని కలిసాను.అతను చనిపోయే ముందు అపోలో హాస్పిటల్ లో ఆయన్ని కలవగానే తనని చూసి నా మనసు చలించిపోయింది.

అతను నా అభిమాని అని తెలిసి సంతోషించాను.ఈ సినిమ మా ఎమోషనల్ సక్సెస్ జర్నీని మీరు కూడా చూడండి అంటూ చిరంజీవి సలాం వెంకీ సినిమా గురించి ఎమోషనల్ ట్వీట్ చేశారు.