మాస్టర్‌ను చివరిగా ‘ఆచార్య’ సెట్‌లో కలిశా: చిరంజీవి

శివ శంకర్ మాస్టర్.సినీ జగత్తులో ఆయన నటరాజుకి నిజ స్వరూపం అని చెప్పుకోవచ్చు.

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో మాస్టర్ మొత్తం 800 చిత్రాలలో కొన్ని వేల పాటలకి డ్యాన్స్ కంపోజ్ చేశారు.

ఎంతో మంది స్టార్ హీరోలు మాస్టర్ డ్యాన్స్ లతో మంచి పేరు తెచ్చుకున్నవారే.

ఇలాంటి లెజండ్రీ డ్యాన్స్ మాస్టర్ కరోనా కారణంగా కన్ను మూయడంతో ఇండస్ట్రీ అంతా శ్రోక సంద్రములో మునిగిపోయింది.

మాస్టర్ అకాల మరణంతో పరిశ్రమలోని స్టార్స్ అంతా.శివ శంకర్ మాస్టర్ తో తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మాస్టర్ తో తనకి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

‘‘శివ శంకర్‌ మాస్టర్‌ మరణ వార్త నన్ను కలచి వేసింది.మాస్టర్ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించారు.

వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం, ముఖ్యంగా ‘ఖైదీ’ సినిమాకు సలీం మాస్టర్‌ అసిస్టెంట్‌గా నాకు చాలా స్టెప్స్‌ ఆయనే కంపోజ్‌ చేశారు, అప్పుడు మొదలైన మా స్నేహం చాలా బలపడింది.

తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. """/"/ చరణ్‌కు బ్లాక్‌ బస్టర్‌ అయిన ‘మగధీర’ సినిమాలోని ‘ధీర ధీర’ పాటకు శివశంకర్‌ మాస్టర్‌కు జాతీయ అవార్డ్‌ అందుకున్నారు.

ఆయనను చివరిగా ఆచార్య సెట్స్‌ లో కలిశాను, అదే చివరిసారి అవుతుందని ఊహించలేదు, ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది.

ఆయన మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్‌ సినీ పరిశ్రమకే తీరని లోటు’ అని చిరంజీవి పోస్ట్ చేశారు.

ఇక శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి ఆయన కుటుంబానికి రూ.

3లక్షల సాయం చేసిన సంగతి తెలిసిందే.ఇంకా అవసరమైతే అంతా ముందుకి వచ్చి మాస్టర్ ని కాపాడుకుంటామని చిరంజీవి తెలిపారు.

మెగాస్టార్ అంతటి వ్యక్తి అండగా ఉన్నా., శివ శంకర్ మాస్టర్ మాత్రం మనకి దక్కకపోవడం నిజంగా శోచనీయం.

మరి.చూశారు కదా? మాస్టర్ మృతి పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

సీఎం పదవినే వద్దనుకున్న సోనూసూద్.. ఈ హీరో నిజంగా గ్రేట్ అని అనాల్సిందే!