పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ లో ఉన్న చిరంజీవి చిన్న కూతురు శ్రీజ... ఫోటోలు వైరల్!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

అయితే ఈమె ఈ విధంగా వార్తల్లో నిలవడానికి గల కారణం అందరికీ తెలిసిందే.

సోషల్ మీడియాలో శ్రీజ తన భర్త పేరును తొలగించి తన ఇంటి పేరును మార్చుకోవడంతో తన భర్తతో గొడవలు వచ్చాయని, విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ విషయం గురించి ఏ విధమైన ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ శ్రీజ ఏదో ఒక పోస్టు ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

ఇక సోషల్ మీడియా వేదికగా శ్రీజ ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ గా మారుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా శ్రీజ తన ఇద్దరు పిల్లలు తన దగ్గరే ఉన్నట్లు ఒక పోస్టు ద్వారా వెల్లడించారు.

తన ఇద్దరు పిల్లలతో కలిసి ఫోటో దిగి తన పిల్లలే తన ప్రపంచమని వెల్లడించారు.

ఇదిలా ఉండగా తాజాగా శ్రీజ తన ఇద్దరు పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"""/" / శ్రీజ ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు నవిష్క, నివృతిలతో కలిసి తమిళనాడులోని కోటగిరి హిల్స్‌కు వెకేషన్‌కు వెళ్లారు.

ఈ క్రమంలోనే అక్కడ తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వైరల్ అయ్యాయి.

ఈ విధంగా శ్రీజ సోషల్ మీడియా ఖాతాకు తన భర్త పేరును తొలగించి నప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించకపోవడంతో నిజంగానే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రేణు దేశాయ్ ఇంట్లో ప్రత్యేక పూజలు… సంతోషం వ్యక్తం చేసిన నటి!