నా జీవిత కథ రాసే బాధ్యత ఆయనదే… చిరంజీవి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్య తిథి, ఎఎన్ఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమా ఇండస్ట్రీ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.
సీనియర్ దివంగత నటులు ఎన్టీఆర్ ( Ntr ) ఏఎన్నార్(Anr ) గారి ఇద్దరు కూడా ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటివారని వీరిద్దరూ కళామతల్లి ముద్దుబిడ్డలని చిరంజీవి తెలియజేశారు.
తాను ఎన్టీఆర్ ఏఎన్నార్ గారి నుంచి ఎన్నో విలువైన సలహాలు తీసుకున్నానని చిరంజీవి తెలిపారు.
బలహీనతల్ని బలాలుగా ఎలా మార్చుకోవాలో అక్కినేని నాగేశ్వరరావు గారి చూసి నేర్చుకున్నానని తెలిపారు.
"""/" /
ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్( Yandamuri Veerendranath ) కూడా హాజరైన సంగతి మనకు తెలిసిందే.
ఇక యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా చిరంజీవి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించారు.ఈ కార్యక్రమంలో చిరంజీవి యండమూరి వీరేంద్రనాథ్ గురించి మాట్లాడటమే కాకుండా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఆయన ఒక గొప్ప రచయిత అని తనపై ప్రశంసల కురిపించారు.అంతేకాకుండా నా జీవిత కథను రాస్తానని యండమూరి గారు ముందుకు రావడం చాలా సంతోషంగా అనిపించిందని చిరంజీవి తెలిపారు.
"""/" /
అందుకే నా జీవిత కథ రాసే అవకాశం ఆయనకే కల్పిస్తున్నానని చిరంజీవి ఈ సందర్భంగా తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక త్వరలోనే చిరంజీవి జీవిత కథ ఆధారంగా సినిమా రాబోతుందని తెలుస్తోంది.ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈయన విశ్వంభర అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లో సక్సెస్ సాధిస్తాడా..?