Ram Gopal Varma : వ్యూహం సినిమాలో చిరంజీవి ప్రస్తావన వెనుక అసలు కథ ఇదేనా.. అందుకే ఆ సీన్లు ఉన్నాయా?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాత్మక దర్శకుడిగా పేరుపొందినటువంటి రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల చిత్రాలను చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
ఇక తాజాగా ఈయన వ్యూహం( Vyuham ) సినిమా ద్వారా వచ్చే ఏడాది ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలోకి రావడం ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది.
"""/" /
ఇక ఈ వ్యూహం సినిమాలో అన్ని నిజాలే ఉన్నాయని వర్మ వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి పాత్రలు కూడా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ చిరంజీవి ( Chiranjeevi ).
కూడా ఉన్నారని ఈ సినిమాలో చిరంజీవిని కూడా భాగం చేశానని తెలియజేశారు.చిరంజీవి వ్యూహం సినిమాలో ఉన్నారనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున పలువురు సందేహాలను వ్యక్తం చేస్తూ అసలు చిరంజీవికి వ్యూహం సినిమాకు సంబంధం ఏంటి ఈ సినిమాలో ఆయన ఎందుకు ఉన్నారు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు రాజకీయాల గురించి మాట్లాడటానికి కూడా ఈయన ఏమాత్రం ఇష్టపడటం లేదు అలాంటిది వ్యూహం సినిమాలో చిరంజీవి పాత్ర ఉండటానికి కారణం ఏంటి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే ఇదే ప్రశ్న వర్మ అడగగా ఆయన తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు.
రాంగోపాల్ వర్మ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నటువంటి ఈ వ్యూహం సినిమాలో 2009వ సంవత్సరంలో జరిగిన రాజకీయాల గురించి కూడా కొన్ని సన్నివేశాలను పెట్టడం జరిగింది అయితే 2009వ సంవత్సరంలో చిరంజీవి రాజకీయాలలో చాలా చురుగ్గా ఉన్నారు.
ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలలో చిరంజీవిని కూడా ఈ సినిమాలో చూపించాల్సి వచ్చింది అంటూ వర్మ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
2024 సంవత్సరంలో వెండితెరపై కనిపించని హీరోలు వీళ్లే.. 2025 వీళ్లకు కలిసొస్తుందా?