బ్రో డాడీ కంటే ముందు.. మెగా కాంపౌండ్ లో ఆసక్తికర చర్చ!

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )ప్రస్తుతం భోళా శంకర్ సినిమా( Bhola Shankar Movie ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

షూటింగ్ కార్యక్రమాలు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుకుంటుంది.భోళా శంకర్ సినిమా తమిళ సూపర్‌ హిట్ చిత్రం కి రీమేక్ అనే విషయం తెల్సిందే.

భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి బ్రో డాడీ అనే మలయాళ సూపర్‌ హిట్ సినిమా ను రీమేక్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

ఆ విషయమై పలు వార్తలు వచ్చాయి. """/" / కానీ బ్యాక్ టు బ్యాక్ రీమేక్ లు అయితే విమర్శలు వచ్చే అవకాశం ఉందని మెగా కాంపౌండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే మెగాస్టార్‌ ఒక డైరెక్ట్‌ సినిమా ను చేసి ఆ తర్వాత బ్రో డాడీ రీమేక్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారట.

ఆ విషయమై ప్రస్తుతానికి తుది నిర్ణయం తీసుకోలేదు.రెండు ఒకే సారి ప్రారంభించి మొదట డైరెక్ట్‌ కథ సినిమా ను విడుదల చేసి ఆ తర్వాత రెండు మూడు నెలలకు బ్రో డాడీ సినిమా రీమేక్ ను విడుదల చేస్తే బాగుంటుంది కదా అనేది కొందరి సలహా.

మొత్తానికి చిరంజీవి తదుపరి సినిమా విషయంలో రకరకాలుగా పుకార్లు చేస్తున్నాయి. """/" / బ్రో డాడీ ( Bro Daddy )సినిమా లో సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

త్రిష.( Trisha Krishnan ).

శ్రీలీల హీరోయిన్స్ అంటూ ప్రచారం జరిగిన నేపథ్యం లో ఎప్పుడెప్పుడు ఈ రీమేక్ వస్తుందా అని కొందరు ఎదురు చూస్తూనే ఉన్నారు.

కనుక బ్రో డాడీ సినిమా చేసినా కూడా పెద్దగా ఇబ్బంది ఉండక పోవచ్చు.

ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం చిరంజీవి తదుపరి సినిమా విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు అంటూ చర్చ జరుగుతోంది.

చిరంజీవి భోళా శంకర్ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన నేపథ్యం లో ఈ సినిమా విషయంలో అంతకు మించి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి.

మెహర్‌ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్‌ సినిమా ఉన్న విషయం తెల్సిందే.

ఆ బాధను మాటల్లో చెప్పలేను.. తండేల్ మూవీ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!