ఆ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వబోతున్న చిరంజీవి.. ప్రూవ్ చేసుకోవడం పక్కా!

ఈ మధ్య కాలంలో చాలామంది స్టార్ హీరోలు తమకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్లను రిపీట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

బాలయ్య బోయపాటి శ్రీను, వెంకటేశ్ అనిల్ రావిపూడి, ఎన్టీఆర్ రాజమౌళి ఇలా ఇండస్ట్రీని షేక్ చేసిన కాంబినేషన్లు ఎక్కువగానే ఉన్నాయి.

అయితే చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు వాల్తేరు వీరయ్య పేరు సమాధానంగా వినిపిస్తుంది.

వాల్తేరు వీరయ్య సినిమా( Waltheru Veeraya Movie ) బాక్సాఫీస్ వద్ద ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా ఈ సినిమాకు బాబీ దర్శకుడు అనే సంగతి తెలిసిందే.

అయితే చిరంజీవి బాబీ కాంబో రిపీట్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

"""/" / త్వరలోనే చిరంజీవి, బాబీ ( Chiranjeevi, Bobby )కాంబో మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.బాబీ చేతిలో ప్రముఖ బ్యానర్ల ఆఫర్లు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్.

చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీ విడుదలైన తర్వాత చిరంజీవి బాబీ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

"""/" / చిరంజీవి బాబీ కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు చిరంజీవి కూతురు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

చిరంజీవి బాబీ కాంబో మూవీ వాల్తేరు వీరయ్య మ్యాజిక్ ను రిపీట్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అటు చిరంజీవి ఇటు బాబీ పారితోషికాలు ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి.ఈ కాంబినేషన్ సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.