చిరంజీవి ‘భోళా శంకర్‌’ రిలీజ్‌ పై మరో రెండు వారాల్లో క్లారిటీ!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఈ ఏడాది ఆరంభం లో సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య చిత్రం( Waltheru Veeraiah Movie ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

సూపర్ హిట్ చిత్రం తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న మరో కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం భోళా శంకర్( Bhola Shankar Movie ).

ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతోంది.అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు 11వ తారీఖున ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

గతం లో రెండు మూడు సార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడడం తో ఆగస్టు లో అయినా ఈ సినిమా వస్తుందా లేదా అనే అనుమానాలు మెగా ఫాన్స్ లో కనిపిస్తున్నాయి.

"""/" / కానీ విశ్వసనీయంగా అందుకున్న సమాచారం ప్రకారం మెగా ఫ్యాన్స్( Mega Fans ) అందరి కోసం మరియు తెలుగు ప్రేక్షకుల కోసం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ గా ఆగస్టు 11 తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే ఈ విషయమై మరో సారి అధికారికంగా క్లారిటీ ఇచ్చేందుకు ఈ నెలలోనే టీజర్ విడుదల చేయబోతున్నారు.

టీజర్ లో విడుదలకు సంబంధించి స్పష్టంగా చెప్పనున్నారు.అదే జరిగితే మెగా ఫ్యాన్స్ కి దసరా పండుగ ముందే వచ్చినట్లు అవుతుంది.

ఈ సినిమా లో చిరంజీవి కి జోడిగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతోంది.

చిరంజీవి ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా ఈ సినిమా లో చూపించబోతున్నట్లుగా దర్శకుడు చెబుతున్నాడు.

ఇది ఒక తమిళ సినిమాకు రీమేక్ అయినా కూడా మొత్తం మార్పులు చేర్పులు చేసి మరీ కొత్త సినిమా గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.