టాలీవుడ్ నుండి సీఎం జగన్ ను కలిసేందుకు వెళ్లబోతున్న టీమ్
TeluguStop.com
టాలీవుడ్ నుండి చిరంజీవి నేతృత్వంలో ఒక టీమ్ వెళ్లి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఏపీలో ఉన్న నిబంధనలను సడలించేందుకు గాను సీఎం జగన్ కు విజ్ఞప్తి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక సినిమా షూటింగ్ లకు సంబంధించిన అనుమతి ఇవ్వడంతో పాటు థియేటర్ల విషయం లో క్లారిటీ ఇవ్వాలని కోరారు.
ఇక ఏపీ లో థియేటర్ల టికెట్ల రేట్లను చాలా తగ్గించారు.దాంతో చిరంజీవి బృందం టికెట్ల రేట్లను పెంచేందుకు రిక్వెస్ట్ ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్న టికెట్ల రేట్ల ను డబుల్ చేయాలని ఇండస్ట్రీ వర్గాల వారు కోరుకుంటున్నారు.
అందుకు సంబంధించిన రిక్వెస్ట్ ఇవ్వడంతో పాటు సీఎం కు టాలీవుడ్ పరిస్థితులను కూడా చిరంజీవి నేతృత్వంలోని బృందం వివరించబోతున్నట్లుగా తెలుస్తోంది.
"""/" /
చిరంజీవి మరియు టాలీవుడ్ ముఖ్యలు కొందరు సీఎం జగన్ ను కలవబోతున్నారు.
ఇటీవలే ఏపీలో జరిగిన వ్యాక్సినేషన్ పై ప్రశంసలు కురిపించిన చిరంజీవి గతంలో కూడా పలు సార్లు వైకాపా ప్రభుత్వం ను అభినందించాడు.
కనుక ఖచ్చితంగా ఈ సారి కూడా సీఎం వైఎస్ జగన్ మెగా స్టార్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఇక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వకీల్ సాబ్ విడుదలకు కొన్ని రోజుల ముందు థియేటర్ల టికెట్ల రేట్ల విషయంలో తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం విమర్శల పాలు అయ్యింది.
పవన్ కళ్యాణ్ కు భయపడే పవన్ మూవీ అని టికెట్ల రేట్లు తగ్గించారంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా జగన్ పై ఆరోపణలు గుప్పించారు.
ఇప్పుడు జగన్ టికెట్ల రేట్ల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా అనేది చూడాలి.
సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నాగార్జున హీరోయిన్…