‘ఆచార్య’ కు గుమ్మడి కాయ కొట్టేది ఎప్పుడో చెప్పేశారు
TeluguStop.com
మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చేస్తున్న సమయంలోనే కొరటాల శివ దర్శకత్వంలో కన్ఫర్మ్ అయ్యింది.
కాని సైరా చేస్తున్న సమయంలో ఈ సినిమా ను చేయడం కష్టంగా భావించి వాయిదా వేస్తూ వచ్చారు.
కాస్త ఆలస్యంగా ప్రకటించి ప్రారంభించిన చిత్ర యూనిట్ సభ్యులకు అనూహ్యంగా కరోనా దెబ్బ పడింది.
కరోనా దెబ్బతో సినిమా దాదాపుగా ఏడాది ఆవుతోంది.గత ఏడాది ఆగస్టు లో విడుదల అవుతుందని భావించిన ఆచార్య సినిమా ను ఈ ఏడాది మే 13వ తారీకున విడుదల చేయాలని నిర్ణయించారు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను గోదావరి జిల్లాల్లో చేస్తున్నారు.
ఇటీవలే చిరంజీవి మరియు చరణ్ లు రాజమండ్రి చేరుకున్నారు.అక్కడ నుండి చిరంజీవి మరియు చిరంజీవిలు షూటింగ్ కోసం అటవి ప్రాంతంకు వెళ్లారు.
ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన తర్వాత సినిమాను వచ్చే షెడ్యూల్ తో ముగించేయాలని భావిస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మార్చి మూడవ వారంకు గుమ్మడి కాయ కొట్ట బోతున్నారట.
ఈ విషయంలో ఇప్పటికే కొరటాల శివ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు.ప్రస్తుతం సినిమా షూటింగ్ విషయంలో ఆచార్య ఫుల్ స్వింగ్ లో ఉంది.
చరణ్ పార్ట్ ను ముగించేందుకు కొరటాల శివ హడావుడిగా షూటింగ్ ను చేస్తున్నట్లుగా యూనిట్ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం చరణ్ మరియు చిరంజీవిల మద్య షూట్ చేస్తున్న సినిమాలు సినిమా కు ప్రధాన ఆకర్షణ గా నిలుస్తాయని దర్శకత్వ టీమ్ చెబుతున్నారు.
అతి త్వరలోనే ఈ సినిమా నుండి చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ సినిమాలో చరణ్ కు జోడీగా ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు.