మెగా వారసులతో మెగా బ్రదర్స్.. వైరల్ అవుతున్న ఫోటో?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ ఫ్యామిలీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మెగా, అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఈ రెండు కుటుంబాలు ఏదైనా పండుగ జరిగిన స్పెషల్ ఈవెంట్స్ ఉన్నా కూడా ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే సంక్రాంతి (Sankranthi) పండుగను పురస్కరించుకొని ఈ రెండు కుటుంబాలు బెంగుళూరులోని తమ ఫామ్ హౌస్ లో ఎంతో ఘనంగా మూడు రోజులపాటు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.
సంక్రాంతి వేడుకలు పూర్తయిన అనంతరం మెగా ఫ్యామిలీ( Mega Family ) మెంబర్స్ అందరూ కూడా తిరిగి హైదరాబాద్ వచ్చేసారు.
"""/" /
సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి ఫోటోలను మెగా ఫ్యామిలీ ఒక్కొక్కరు వారికి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇందులో భాగంగా ఒక ఫోటో మాత్రం అందరిని చాలా ఆకట్టుకుంటుంది.చిరంజీవి(Chiranjeevi) తో కలిసి నాగబాబు సెల్ఫీ దిగుతూ ఉండగా వీరి వెనకే మెగా వారసులందరూ కూడా ఉండటం విశేషం.
"""/" /
ఈ విధంగా నాగబాబు చిరంజీవి ఇద్దరు సెల్ఫీ దిగుతూ ఉండగా వెనక రామ్ చరణ్,( Ram Charan ) వరుణ్,( Varun Tej ) అకీరా, ఆద్య, ఉపాసన అల్లు శిరీష్ కూర్చుని ఉన్నారు.
ఇక ఈ ఫోటోని నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మెగా వారసులతో మెగా ఫోటో అంటూ అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వేడుకలలో పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా( Akira ) అద్భుతంగా పియానో వాయించి అందరిని ఆకట్టుకున్నారు.
ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
నాని ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏంటో తెలుసా..?