చిరు, బాలయ్య ఇంటర్వ్యూ లేనట్లే.. మైత్రి వారి ప్రయత్నాలు సఫలం కాలేదు

ఈ సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది.

జనవరి 12వ తారీఖున వీర సింహా రెడ్డి సినిమా తో బాలయ్య రంగం లోకి దిగబోతుండగా ఒక్క రోజు ఆలస్యంగా అంటే జనవరి 13వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఈ సంక్రాంతి కి ఈ ఇద్దరు హీరోలు కూడా సూపర్ హిట్ అవడం ఖాయం అని మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా ధీమా తో ఉన్నారు.

ఈ రెండు సినిమా లను కూడా నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్ వారే అవ్వడం తో అంచనాలు భారీగా పెరిగాయి.

ఇక ఈ రెండు సినిమా లను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించింది కనుక మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లను ఒకే వేదిక పైకి తీసుకు వచ్చి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని అంతా భావించారు.

సుమ యాంకర్ గా ఇద్దరు హీరోల మధ్య పలు ఆసక్తికర విషయాలను చర్చించేందుకు ఇంటర్వ్యూ నిర్వహించబోతున్నారని అంతా భావించారు, కానీ ఆ ఇంటర్వ్యూ లేనట్లే అని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఇద్దరు స్టార్ హీరోలతో అది కూడా బాలకృష్ణ మరియు చిరంజీవి వంటి లెజెండ్స్ తో ఇంటర్వ్యూ చేయడం అంటే మామూలు విషయం కాదు.

"""/"/అభిమానులకు కాస్త అటు ఇటు అయినా కూడా గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది.

సినిమా లకు మొదటికే మోసం వస్తుంది.అందుకే సినిమా ప్రమోషన్ కార్యక్రమం లో భాగంగా కాకుండా ఆ తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తే చేయవచ్చు అంటున్నారు.

చిరంజీవి మరియు బాలకృష్ణ లను సమానంగా ట్రీట్‌ చేస్తూ ఇంటర్వ్యూ చేయడం అంటే దాదాపుగా అసాధ్యం.

అందుకే ఆ నిర్ణయాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారి వెనక్కు తీసుకున్నట్లుగా వారి సన్నిహితులు చెబుతున్నారు.