చిరంజీవి మరో నిర్ణయం.. సోనూసూద్‌ ను మించి

ఈ మద్య కాలంలో సోనూ సోద్ ఆ ప్రభుత్వాలను మించి సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెల్సిందే.

పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఆయనకు ఏకంగా పద్మ భూషన్ అవార్డును ఇవ్వాలంటూ నెటిజన్స్ డిమాండ్‌ చేస్తున్నారు.ఈ సమయంలోనే సోనూ సూద్‌ ను మించి మరీ మెగా స్టార్‌ చిరంజీవి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం చిరంజీవి ఆక్సీజన్‌ బ్యాంక్‌ ద్వారా వందల మందికి ప్రాణాపాయంలో సాయం గా నిలిచారు.

మరో వైపు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ ద్వారా పెద్ద ఎత్తున జనాలకు సేవా కార్యక్రమాలను అందించడం జరిగింది.

ఇదే సమయంలో చిరంజీవి నుండి మరో కీలక ప్రకటన వచ్చింది.మెగా స్టార్ చిరంజీవి మరో ఛారిటీ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు.

"""/"/ ఇకపై కరోనా కారణం గా ఆసుపత్రి కి వెళ్లాలనుకునే వారు వెంటనే ఈ చిరంజీవి ఆంబులెన్స్‌ ను అందుబాటు లో ఉంచబోతున్నారు.

ఆంబులెన్స్ సర్సీస్ ను ఉచితంగా అందించేందుకు చిరంజీవి మొదలు పెట్టి ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి ఉపయోగపడబోతుంది.

కరోనా పేషంట్స్ అనగానే ఎక్కువ మంది ఆంబులెన్స్ వారు పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు.

దాంతో ఎంతో మంది కనీసం ఆంబులెన్స్ లో కూడా తీసుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

ఈ సమయంలో చిరంజీవి మొదలు పెట్టిన ఆంబులెన్స్‌ సర్వీస్ ఖచ్చితంగా పేద వారికి సహాయం గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

 చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాల తో ఆయన ఇప్పుడు సోనూ సూద్ ను మించి ఫుల్‌ జోష్ గా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అంటూ మెగా అభిమానులు అంటున్నారు.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్