ఇప్పుడు ఆచార్య మేకర్స్‌ ఆ ప్రకటన చేసి ఫ్యాన్స్ ను ఏడిపిస్తారేమో

మెగా స్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య విడుదలకు సిద్దం అయ్యింది.కాని విడుదల మాత్రం అయ్యేలా కనిపించడం లేదు.

గత ఏడాది కాలంగా సినిమాను వాయిదా వేస్తున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే 2020 ఆగస్టులో సినిమా విడుదల అయ్యి ఉండేది.

కాని కరోనా వల్ల 2021 మే కు వాయిదా వేశారు.కాని సెకండ్ వేవ్‌ వల్ల సినిమా ను ఏకంగా ఈ ఏడాది ఫిబ్రవరి 4కు వాయిదా వేయడం జరిగింది.

కాని ఇప్పుడు ఆ తేదీ లో కూడా సినిమా విడుదల అవడం కష్టంగా మారింది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆచార్య సినిమాను అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తున్నారు.

కరోనా వల్ల సినిమా ను విడుదల చేయలేక పోతున్నారు.ఆచార్య విడుదల వాయిదా అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాని ఇటీవల వచ్చిన ఒక పోస్టర్ లో కూడా ఆచార్య ను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

దాంతో అభిమానులు ఒకింత ఆనందం వ్యక్తం చేశారు.కాని ఏపీలో ఇప్పుడు ఆంక్షలు పెట్టడంతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీ విధించడం వల్ల ఏం చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే అక్కడ టికెట్ల రేట్లు పాతాళంలో ఉన్నాయి. """/" / ఒక వేళ సినిమా ను 50 శాతం ఆక్యుపెన్సీ తో విడుదల చేస్తే అసలు వసూళ్లు నమోదు అవ్వడం ఏమో కాని తీవ్ర నష్టాలు తప్పవు అంటున్నారు.

అందుకే ఆచార్య సినిమా ను వాయిదా వేస్తారనే వార్తలు వస్తున్నాయి.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఆచార్య నిలుస్తుందనే నమ్మకంతో ప్రతి ఒక్కరు ఉన్నారు.

ఇలాంటి సమయంలో సినిమా ను మంచి తేదీ న విడుదల చేయడం మంచిది.

అందుకే ఆచార్య సినిమా ను ఒక మంచి తేదీ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

అందుకే మళ్లీ వాయిదా వేసి దసరాకు లేదా వచ్చే ఏడాది విడుదల చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.

నేషనల్ అవార్డ్ కోసం ఎదురుచూస్తున్నానన్న సాయిపల్లవి.. ఆ అదృష్టం వరిస్తుందా?