చిరంజీవి చెప్పిన ఆ వడ్డీ అయినా 'ఆచార్య' రాబట్టేనా?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు దాదాపుగా రెండు సంవత్సరాల నుండి ఎదురు చూశారు.
అపజయమెరుగని కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.
దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు చరణ్ సినిమా లో ఓ కీలక పాత్రలో కనిపించడం తో పాటు మహేష్ బాబు ఈ సినిమాకు తన వాయిస్ ని ఇవ్వడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.
చిరంజీవితో పాటు రామ్ చరణ్ కలిసి నటించిన సన్నివేశాలను చూడడం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు.
ఈ సినిమా ఫలితం చాలా నిరాశను కలిగిస్తుంది.విడుదల ప్రమోషన్ సందర్భంగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టాం.
సినిమా ఆలస్యం అవడం వల్ల బడ్జెట్ కి అదనంగా 50 కోట్ల వడ్డీ అయింది అంటూ ఏవో లెక్కలు చెప్పాడు.
ఆచార్య సినిమా విడుదలైన తర్వాత వస్తున్న వసూళ్లను చూస్తే చిరంజీవి అదనంగా అయినట్లుగా చెప్పిన రూ.
50 కోట్ల వడ్డీ వరకైనా ఆచార్య సినిమా రాబట్టేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు మూడు నెలలుగా ఆచార్య సినిమాకు విపరీతమైన ఆసక్తి క్రియేట్ అయింది.
దాన్ని అందిపుచ్చుకోవడంలో దర్శకుడు కొరటాల శివ పూర్తిగా విఫలమయ్యాడు.ఏ మాత్రం అనుమానం లేకుండా ఈ సినిమా విడుదల కావడం కాస్త కలిసి వచ్చే అంశం అని అంతా అనుకున్నారు.
"""/" /
కానీ అదే అత్యంత దారుణమైన ఫ్లాప్ కి కారణమైంది.భారీ అంచనాలు సినిమాకు ఉన్నాకూడా ఒక మోస్తరు వరకు అభిమానులు సినిమా థియేటర్ కు వచ్చారు.
భారీ ఎత్తున సినిమా థియేటర్లకు జనాలు రాకపోవడం తో ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయి.
మొదటి మూడు రోజులు ఆచార్య సినిమా ఒక మోస్తరు వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
అవి బ్రేక్ ఈవెన్ సాధించేందుకు ఏ మాత్రం ఉపయోగపడని మొత్తం అంటున్నారు.బ్రేక్ ఈవెన్ మొత్తం లో కనీసం 50 శాతం కూడా రాబట్టే అవకాశం లేదంటూ సినీ విశ్లేషకులు మరియు బాక్స్ ఆఫీసు నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి ఆచార్య సినిమా అనకూడదు కాని డిజాస్టర్ అనక తప్పడం లేదు.
రీల్ చేసి ఫేమస్ అవుదామనుకున్నాడు.. కానీ, పోలీసులు దెబ్బకు దిమ్మ తిరిగిందిగా