రంజాన్ కూడా 'ఆచార్య' ను కాపాడలేక పోయింది

చిరంజీవి, చరణ్ నటించిన సినిమా అవ్వడంతో ఆచార్య సినిమా విడుదలకు ముందు అంచనాలు పీక్స్ లో నమోదు అయ్యాయి.

వందల కోట్ల సినిమా అంటూ ప్రచారం జరిగింది.ట్రైలర్ విడుదల సమయంలో తండ్రి కొడుకులను ఒకే సినిమాలో చూడబోతున్నాం అంటూ మెగా అభిమానులు చాలా ఆసక్తిని కనబర్చారు.

దర్శకుడు కొరటాల శివ ఒక్క ప్లాప్ ను కలిగి లేడు కనుక ఆచార్య సినిమా సూపర్ డూపర్ హిట్‌ అవ్వడం ఖాయం అని అంతా భావించారు.

కాని అంచనాలు తారుమారు అయ్యాయి.ఏమాత్రం ఆచార్య ఆకట్టుకోలేక పోయింది.

ఆచార్య సినిమా మొదటి మూడు రోజులు ఒక మోస్తరు వసూళ్లను దక్కించుకుంది.సోమవారం దారుణంగా వసూళ్లు పడిపోయాయి.

ఇక మంగళవారం రోజు అయిన నేడు రంజాన్ కారనంగా సెలవు వచ్చింది.ఈ సెలవు రోజు ఆచార్య కు మళ్లీ ఒక మోస్తరు వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు.

కాని అనూహ్యంగా రంజాన్ రోజు కూడా ఆచార్య కు కలిసి రాలేదు. """/"/ మరి కొన్ని రోజుల్లో ఓటీటీ లో ఎలాగూ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పుడు వందలకు వందల టికెట్లు రేట్లు ఉండగా వెళ్లాల్సిన అవసరం ఏంటీ అన్నట్లుగా ప్రేక్షకులు అభిప్రాయం తో రంజాన్ సెలవు రోజున కూడా ఆచార్య ను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఇప్పుడు అంతా కూడా సుమ నటించిన జయమ్మ పంచాయితి మరియు మహేష్‌ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నారు.

మే 6వ తారీకున జయమ్మ పంచాయితీ విడుదల కాబోతుండగా.సర్కారు వారి పాట సినిమా మే 12వ తారీకున విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

సుమ సినిమా వచ్చేప్పటికి ఆచార్య సినిమా పూర్తిగా కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయి.

అది జయమ్మ పంచాయితీ సినిమాకు కలిసి వచ్చే అంశం అవ్వబోతుంది.

సెర్చ్‌లో కమలా హారిస్‌ కథనాలే .. గూగుల్‌పై డొనాల్డ్ ట్రంప్‌ సంచలన ఆరోపణలు