చిరు డ్యాన్స్ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఇక వరుసబెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ పోస్టులతో రెచ్చిపోతుండటంతో మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

కాగా ఇటీవల చిరు ఫ్యాన్స్‌కు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇస్తానని, తన డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేస్తానంటూ తెలిపాడు.

కానీ బాలీవుడ్‌లో ఇద్దరు నటులు మృతిచెందడటంతో తన వీడియోను పోస్ట్ చేయకుండా వాయిదా వేశాడు.

ఇక తాజాగా చిరు తన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అయితే ఆచార్య సినిమాకు సంబంధించిన వీడియో అయి ఉంటుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

కానీ ఈ వీడియో 80లలోని నటీనటులు అందరూ కలిసి ఒకచోట ఏకమై చేసిన సందడికి సంబంధించిన వీడియో కావడంతో ప్రేక్షకులు కాస్త నిరాశకు లోనయ్యారు.

అయితే ఈ వీడియలో అప్పటి హీరోయిన్లతో చిరు వేసిన స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఏదేమైనా చిరు గ్రేస్ మరే హీరోకు రాదని వారు మరోసారి బల్లగుద్ది చెబుతున్నారు.

మెగాస్టార్ రిలీజ్ చేసిన ఈ వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తుండటంతో అది వైరల్‌గా మారింది.

ఇక ప్రస్తుతం చిరు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో చిరు సరికొత్త గెటప్‌లో మనకు కనిపించనున్నాడు.ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తూనే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.

కాగా అందాల భామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుపై విచారణ వాయిదా