అరాచకం సృష్టిస్తున్న మెగాస్టార్ మాస్ లుక్!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇప్పటికే మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేకపోయింది.

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇక ఎట్టకేలకు ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కాబోతుంది.

చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలు ప్రకటించాడు.

ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా జరుగుతుంది.ఇక త్వరలోనే భోళా శంకర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు చిరంజీవి ప్లాన్ చేస్తున్నాడు.

"""/"/ అయితే చిరంజీవి ఈ రోజు మరొక సినిమాను స్టార్ట్ చేసాడు.బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను ఈ రోజు పూజా కార్యక్రమాలతో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా తెరకెక్కబోతుంది.ఇక ఈ విషయాన్నీ స్వయంగా డైరెక్టర్ బాబీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపాడు.

"""/"/ ఈ మేరకు ఆయన మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ పోస్టర్ లో మెగాస్టార్ లుక్ మాములుగా లేదు.మాస్ లుక్ లో అదరగొడుతున్నాడు.

కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని, చేతిలో సిగరెట్ తో ముఠామేస్త్రి చిత్రాన్ని గుర్తు చేసే విధంగా ఉన్నాడు.

బాబీ ట్వీట్ చేస్తూ.మాస్ మూల విరాట్ అవతారంలో అన్నయ అరాచకం మొదలు అంటూ ట్వీట్ చేసాడు.

ప్రెసెంట్ చిరు మాస్ లుక్ నెట్టింట వైరల్ అయ్యింది.ఇక ఇప్పటికే ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.

విశాఖ సౌత్ వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!