ఐదుగురు టాప్ డైరక్టర్స్ ఆధ్వర్యంలో చిరు 154 ఓపెనింగ్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరక్షన్ లో సినిమా మొదలైంది.

ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లో జరుపుకున్నారు.ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

సినిమా పూజా కార్యక్రమానికి గెస్టులుగా ఐదుగురు టాప్ డైరక్టర్స్ వచ్చారు.అందులో దర్శకేంద్రుడు కె.

రాఘవేంద్ర రావు ఒకరు కాగా వినాయక్, కొరటాల శివ, పూరీ జగన్నాథ్, హరీష్ శంకర్ ఉన్నారు.

"""/"/ ఐదుగురు డైరక్టర్స్ ప్రొడ్యూస్ర్స్, చిరుతో కలిసి డైరక్టర్ కె.ఎస్ రవీంద్రకు స్క్రిప్ట్ అందించారు.

సినిమా ఓపెనింగ్ కు ఐదుగురు టాప్ డైరక్టర్స్ రావడం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది.

ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు చిత్రయూనిట్.

ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న చిరు ఆ సినిమాతో పాటుగా భోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు.

కె.ఎస్ రవీంద్ర సినిమాకు టైటిల్ గా వాళ్తేరు వీరయ్య పరిశీలనలో ఉంది.

అయితే ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు.

సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 15 నుండి జరుగనుందని తెలుస్తుంది.

కూటమి నేతలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు