అక్కడ వైసీపీ టిడిపి లకు టెన్షన్ పుట్టిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి
TeluguStop.com
ఏపీలో కాంగ్రెస్( AP Congress ) పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఆ పార్టీ ఉన్నా లేనట్టుగానే అన్న పరిస్థితి.అయితే ఇటీవల కాలంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల( YS Sharmila ) విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో కాంగ్రెస్ లో కాస్తో కూస్తో ఊపు అయితే కనిపిస్తోంది.
ఎక్కడా సొంతంగా ఒక నియోజకవర్గంలోనూ గెలిచే పరిస్థితి కాంగ్రెస్ కు లేదనే విషయం అందరికీ తెలిసిందే.
కాకపోతే కడప నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయడంతో, ఆమె వైసిపి ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చినట్టుగా కనిపిస్తుండగా, బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్( Amanchi Krishna Mohan ) స్థానికంగా బలంగా ఉండడంతో, వైసిపి, టిడిపిలు టెన్షన్ పడుతున్నాయి.
రెండు నెలల క్రితం వరకు వైసిపి పర్చూరు ఇన్చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి, చీరాల నుంచి పోటీ చేశారు.
"""/" /
గతంలో టిడిపిని వీడి వైసీపీలో చేరిన సమయంలో, పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి వైసిపిలో చేరారు.
అయితే వైసీపీని వీడే సమయంలో ఆ పార్టీ పైన , జగన్ పైన ఏ విమర్శలు చేయకుండా ఆమంచి కృష్ణమోహన్ బయటకు వచ్చారు .
చీరాల( Chirala ) నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా, ఆ అవకాశం లేకపోవడంతోనే పార్టీని వీడికి కాంగ్రెస్ లో చేరారు.
2014లో కాంగ్రెస్ ను వీడిని ఆమంచి కృష్ణమోహన్ నవోదయం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు.
ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి పర్చూరుకు మారినప్పుడు అప్పటి వరకు ఆయన వెంట నడిచిన క్యాడర్ కరణం వెంకటేష్( Karanam Venkatesh ) వైపు వెళ్ళిందట.
కరణం ఫ్యామిలీ పార్టీ మారే సమయంలో తమ వెంట నడిచిన అనుచరులు చాలామంది తిరిగి టిడిపి వైపు వెళ్లారు.
"""/" /
వైసీపీ నుంచి కరణం, టిడిపి తరఫున కొండయ్య వర్గాలు మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సమయంలోనే కాంగ్రెస్ నుంచి స్థానికంగా పట్టు ఉన్న ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేయడంతో టిడిపి, వైసిపిలు టెన్షన్ పడుతున్నాయి.
సొంత సామాజిక వర్గం కాపులతో పాటు , మత్స్యకార ,ఎస్సీ దేవాంగ, పద్మశాలి ఓట్ బ్యాంక్ చీలి పోయే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.
ఇదంతా ఆమంచి కృష్ణమోహన్ వైపుకు డైవర్ట్ అయిందనే అనుమానం మొదలైంది.ముఖ్యంగా టిడిపికి( TDP ) అనుకూల సామాజిక వర్గాలుగా ఉన్న వీరు ఆమంచి వైపు మొగ్గు చూపించారేమో అన్న అనుమానం టిడిపిలో నెలకొంది .
టిడిపి అభ్యర్థి మాలకొండయ్యది యాదవ సామాజిక వర్గం కావడంతో, ఆ కులం ఓట్లు వైసీపీ నుంచి కూడా టిడిపికి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఎమ్మెల్యే ఓటు తమకు వేసి, ఎంపీ ఓటు మీ ఇష్టం వచ్చిన వారికి వేసుకోవచ్చు అంటూ ఆమంచి అనుచరులు ఓటర్లకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది.
స్థానికంగా ఆమంచికి గట్టిపట్టు ఉండడంతో, గెలుపు పై టిడిపి, వైసిపిలు టెన్షన్ కు గురవుతున్నాయి.
రాజమౌళి మహేష్ బాబు సినిమా మొదటి షెడ్యూల్ జరిగేది అక్కడేనా..?