జనసేన పార్టీని సపోర్ట్ చేస్తానంటున్న చింతమనేని ప్రభాకర్..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చింతమనేని ప్రభాకర్ తెలియనివారుండరు.పశ్చిమగోదావరి జిల్లా టిడిపి నాయకుడిగా దెందులూరు మాజీ శాసన సభ్యుడిగా పేరొందిన చింతమనేని.

అప్పట్లో వైఎస్ జగన్ ని నిండు అసెంబ్లీ లో భారీ స్థాయిలో విమర్శలు చేయడం మాత్రమే కాక వనజాక్షి అనే మహిళా అధికారిని కొట్టినట్లు అప్పట్లో వార్తల్లో నిలిచారు.

కాగా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన చింతమనేని తర్వాత జైలు పాలవడం .ఆ తర్వాత బయటకు రావడం ప్రస్తుతం పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో టిడిపి తరపున కీలకంగా రాణిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలలో .జరిగిన పరిణామాలపై ఊహించని రీతిలో స్పందించారు.

టీడీపీ తరఫున నామినేషన్ వేసిన తర్వాత .విత్‌ డ్రా చేసుకున్న టీడీపీ అభ్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో జనసేన పార్టీ అభ్యర్థులు ఉంటే పోటీకి దిగండి, నేను మీ తరఫున .

మీ పార్టీ ని సపోర్ట్ చేస్తాను అంటూ చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక్క జనసేన మాత్రమే కాదు బీజేపీ అభ్యర్థులు ఉన్నాగాని ప్రచారంలో పాల్గొంటా అని పేర్కొన్నారు.

టిడిపి పార్టీ ని అమ్ముకున్న వారికి .భవిష్యత్తు ఉండదని .

, పార్టీని నమ్ముకున్న వారికి తాను అండగా ఉంటాను అంటూ చింతమనేని భరోసా ఇచ్చారు.

దీంతో చింతమనేని బరిలోకి దిగడంతో ఏలూరు మున్సిపల్ ఎన్నికల  వాతావరణం  ఒక్కసారిగా వేడెక్కింది.

ఎన్టీయార్ పాన్ ఇండియా డైరెక్టర్లనే ఎంచుకుంటున్నాడా..? కారణం ఏంటి..?