దెందులూరులో చింతమనేని ప్రభాకర్ విజయోత్సవ సంబరాలు..!!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు కీలక స్థానాలలో గెలవడం తెలిసిందే.

వైసీపీ బలంగా ఉండే రాయలసీమ ప్రాంతాలలో సైతం తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది.

9 జిల్లాలలో 108 నియోజకవర్గాలలో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో.టీడీపీ తిరుగులేని విజయం సాధించటంతో చంద్రబాబుతో పాటు క్యాడర్ ఫుల్ సంతోషంగా ఉంది.

ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులను చంద్రబాబు ప్రత్యేకంగా సత్కరించారు.అయితే ఈ గెలుపు పై దెందులూరు( Dendulur ) మాజీ ఎమ్మెల్యే టీడీపీ రెబల్ నేత చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) సంతోషం వ్యక్తం చేశారు.

పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి గెలవడం హర్షించదగ్గ విషయమని చెప్పుకొచ్చారు.ఇది ఆంధ్రుల విజయం అని దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

వైసీపీ పట్టాభద్రులు( YSRCP ) బుద్ధి చెప్పారని .సంబరాల అనంతరం చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చాలా ఎన్నికలలో వైసీపీ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడం జరిగింది.

అయితే సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వచ్చిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ పుంజుకోవటం ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసినట్లయింది.

భారతీయుడు 2 లో కమలహాసన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారా..?