బురద పొలాన్ని తలపిస్తున్న చింతగూడెం రోడ్డు…!

నల్లగొండ జిల్లా: అనుముల మండలం చింతగూడెం నుండి కనగల్ వెళ్లే ప్రధాన రహదారి బురద పొలాన్ని తలపిస్తూ రాకపోకలకు అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని,స్థానికులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాల కారణంగా రోడ్లు మొత్తం చిత్తడిగా మారడంతో స్థానికులు నడిచిపోయే పరిస్థితి లేదని, చిన్న పిల్లలు,వృద్దులు రోడ్డు మీదకు రాలేక పోతున్నారని వాపోతున్నారు.

ప్రజా ప్రతినిధుల,అధికారుల వాహనాల నిత్యం ఈ రహదారి గుండానే వెళతాయని,అనేకసార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా వారికి పట్టకపోవడం బాధాకరం అంటున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

ఈ ఇద్దరి చేతిలో దెబ్బలు తిన్న నాగార్జున.. పనులు చేయకపోతే అలా బిహేవ్ చేసేవారా?