హాస్యనటుడికి అరుదైన గౌరవం..రోడ్డుకి కమెడియన్ పేరు..?

దివంగత తమిళ హాస్య నటుడు అయిన వివేక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తమిళంలో ఎన్నో సినిమాల్లో హాస్యనటుడిగా నటించి ఏర్పరచుకున్నాడు.వివేక్‌ కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

వివేక్ గత ఏడాది కరోనా మహమ్మారి బారిన పడి ఆ తర్వాత గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

వివేక్ మరణం తమిళ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.ఆ సమయంలో వివేక మరణవార్త విన్న సినీ ప్రేక్షకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

మొదట కరోనా మహమ్మారి బారిన పడిన వివేక్ ఆ తర్వాత క్రమంగా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి పాలయ్యారు.

ఆ తర్వాత గుండెపోటు కారణంగా అకస్మాత్తుగా మరణించారు.ఇప్పటికీ ఆయన అభిమానులు అతని మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా వివేక్‌ కు ఒక అరుదైన గౌరవం దక్కింది.

వివేక్‌ చెన్నైలోనీ విరుగంబాక్కం అన్న ప్రాంతంలో నివసించాడు.తాజాగా ఆ ప్రాంతం ప్రజలు ఒక వీధికి చిన్న కలైవనర్ వివేక్ రోడ్ అని పేరును పెట్టారు.

"""/"/ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సిఫార్సు మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నీటి సరఫరా విభాగం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

వారం రోజుల క్రితం వివేక్ భార్య ఆరుల్ సెల్వి తన కూతురితో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.

కె.స్టాలిన్ ను కలిశారు.

వారు నిర్వహిస్తున్న వీధికి వివేక్ పేరు పెట్టాల్సిందిగా కోరారు.వారి కోరిక మేరకు ముఖ్యమంత్రి ఎం.

కె.స్టాలిన్ కూడా వారి కోరికను నెరవేర్చారు.

దీనితో ఆ ప్రాంతంలోని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఒకరికి ఇవ్వాల్సిన అవార్డు మరొకరికి ఇచ్చారు..ఫ్యాన్స్ ఫుల్ యాంగ్రీ