సీఎం జగన్ కి గర్వం ఉండదు చిన్న జీయర్ స్వామి పొగడ్తలు..!!
TeluguStop.com
ఈరోజు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ శంషాబాద్ కి చేరుకుని ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో.
పాల్గొన్నారు.సాంప్రదాయబద్దంగా పంచెకట్టులో జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమాజంలో.అసమానతలు తొలగించడానికి రామానుజులు పూనుకున్న పోరాటాన్ని కొనియాడారు.
అనంతరం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చిన్న జీయర్ స్వామి.సీఎం వైఎస్ జగన్ ని పొగడ్తలతో ముంచెత్తారు.
ముఖ్యమంత్రి జగన్ నిబద్ధత తనకు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు.అన్ని వర్గాల ప్రజలకు అద్భుతమైన నాణ్యమైన విద్యను.
అందిస్తున్నారని.జగన్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.
పాలకుడు అందరి అవసరాలను గుర్తించి సమానంగా చూసి.పరిపాలన అందించాలని పేర్కొన్నారు.
సాధారణంగా విద్య, వయస్సు అదేవిధంగా ధనం, అధికారం కలిగిన వాళ్ళు.ఇతరుల సలహాలు పెద్దగా తీసుకోరు.
కానీ ఇవన్నీ వైయస్ జగన్ కి ఉన్నాగాని.ఏటువంటి గర్వం లేకుండా.
అందరి సలహాలు స్వీకరిస్తారు, అదేవిధంగా పాటిస్తారు అని ప్రశంసల వర్షం కురిపించారు.వైయస్ జగన్ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు చిన్న జీయర్ స్వామి స్పష్టం చేశారు.
డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అప్పుడేనట.. గేమ్ ఛేంజర్ ను మించి బాలయ్య మెప్పిస్తాడా?