వ్యాక్సిన్ తీసుకుంటే బ్లడ్ డొనేట్ చేయకూడదా.. చిన్మయి ఏం చెప్పారంటే..?

భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇతర దేశాలతో పోలిస్తే శరవేగంగా జరుగుతోంది.

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మన దేశంలోని ప్రజలు సైతం వ్యాక్సిన్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ కు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఆ వార్తల్లో వాస్తవాలు, అవాస్తవాలు తెలియక ప్రజలు టెన్షన్ పడుతున్నారు.

ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత బ్లడ్ డొనేట్ చేయవచ్చా.? చేయకూడదా.

? అనే సందేహం చాలామందిని వేధిస్తోంది.అయితే స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద బ్లడ్ డొనేషన్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఎవరైతే కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటారో వాళ్లు 58 రోజుల వరకు బ్లడ్ డొనేషన్ చేయకూడదని ఆమె అన్నారు.

అందువల్ల ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుంటే ముందుగానే బ్లడ్ డొనేషన్ చేయాలని ఆమె చెప్పారు.

"""/"/ నేషనల్ బ్లడ్ ట్రాన్స్ మిషన్ కౌన్సిల్ చెప్పిన విషయాలను వెల్లడించి ప్రజలకు బ్లడ్ డొనేషన్ గురించి చిన్మయి అవగాహన పెరిగేలా చేశారు.

చిన్మయి బ్లడ్ డొనేషన్ గురించి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరోవైపు కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తుండగా రోజురోజుకు పెరుగుతున్న కేసుల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

దేశంలో లాక్ డౌన్ విధిస్తే మంచిదని ప్రజల్లో కొంతమంది అభిప్రాయపడుతున్నారు.కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

ఇలాంటి సమయంలో ప్రజలకు కరోనా విషయంలో నెలకొన్న సందేహాలకు సంబంధించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న చిన్మయిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

కరోనాకు సంబంధించి మరిన్ని అవగాహన వీడియోలు చేయాలని నెటిజన్లు చిన్మయిని కోరుతున్నారు.

అంగారక గ్రహంపై జీవాన్ని కనిపెట్టడానికి ఆ టీమ్‌తో చేతులు కలిపిన నాసా..