టైట్‌గా ఉంటేనో నొప్పి వస్తేనో వర్జిన్ కాదు.. చిన్మయి సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ సింగర్లలో చిన్మయి( Chinmai ) ఒకరనే సంగతి తెలిసిందే.

చిన్మయి పాటలకు, గాత్రానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి అమ్మాయిల సమస్యల గురించి స్పందించడం ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

అయితే తాజాగా చిన్మయి వర్జినిటీ( Virginity ) గురించి మాట్లాడుతూ బోల్డ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అబ్బాయిలు అమ్మాయిల విషయంలో బిహేవ్ చేసే విధానం గురించి స్పందిస్తూ చిన్మయి షాకింగ్ కామెంట్లు చేశారు.

అమ్మాయిల విషయంలో అబ్బాయిలకు ఉన్నవి అన్నీ అపోహలే అని ఆమె అన్నారు.తొలి కలయిక సమయంలో నొప్పిగా ఉంటుందని అనుకోవద్దని చిన్మయి తెలిపారు.

టైట్ గా ఉంటేనో రక్తం వస్తేనో వర్జిన్ అని అనుకోవద్దని ఆమె కామెంట్లు చేశారు.

అలా జరిగే ప్రచారంలో నిజం లేదని ఆమె అన్నారు. """/" / అమ్మాయిల విషయంలో అబ్బాయిల ఆలోచనలను మార్చాలనే ఆలోచనతో చిన్మయి ఈ కామెంట్లు చేశారు.

ఒక ట్రోలింగ్ వీడియోను షేర్ చేస్తూ చిన్మయి ఈ విషయాలను వెల్లడించారు.తొలి కలయిక సమయంలో బాధ, నొప్పి ఉంటేనే సమస్య అని అలాంటి సమయంలో వైద్య సహాయం తీసుకోవాలని చిన్మయి సూచనలు చేశారు.

పెళ్లి కొడుకులు ఊహించే దానికి రియాలిటీకి చాలా తేడా ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

"""/" / చిన్మయి చెప్పిన విషయాలతో నెటిజన్లు సైతం ఏకీభవిస్తున్నారు.చిన్మయిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

తొలి కలయిక విషయంలో వచ్చే ట్రోల్స్ గురించి పట్టించుకోవవద్దని ఆమె సూచనలు చేయడం గమనార్హం.

చిన్మయి వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.కొన్ని విషయాలకు సంబంధించి అబ్బాయిల మైండ్ సెట్ మారాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చిన్మయిని మాత్రం నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

పాసింజర్ ఇచ్చిన గిఫ్ట్‌కి ఆటోడ్రైవర్ ఫిదా.. వీడియో వైరల్..