ఒకపక్క కరోనా వైరస్ కలకలం,గబ్బిలాన్ని తినేసిన అమ్మాయి
TeluguStop.com
ఇటీవల దేశాలని గడగడా లాడిస్తున్న కొత్త వైరస్ కరోనా.ఈ వైరస్ చైనా నుంచి పాక్కుంటూ భారత్ కు కూడా చేరింది అంటూ వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే.
అయితే ఈ కరోనా వైరస్ కు ప్రధాన కారణం పాము,గబ్బిలాలు వంటి వాటివల్ల అని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఇలాంటి సమయంలో ఒక అమ్మాయి గబ్బిలాన్ని తిని అందరి మతులు పోగొట్టింది.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/01/Chinese-woman-eating-bat-at-restaurant-గబ్బిలాన్ని-తినేసిన-అమ్మాయి-1!--jpg"/ఒకపక్క పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు పాము,గబ్బిలాలు వల్లే ఈ వైరస్ వ్యాపిస్తుంది అని అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెబుతుంటే చైనా కి చెందిన ఈ అమ్మాయి మాత్రం చాలా కూల్ గా గబ్బిలాన్ని తినింది.
ఇప్పుడు ఈ గబ్బిలాన్ని తింటున్న వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.
ఒక రెస్టారెంట్ కు వెళ్లిన ఆ అమ్మాయి గబ్బిలం తో చేసిన సూప్ ను తాగింది.
అంతేకాకుండా వండిన గబ్బిలాన్ని కూడా ఆమె ఎంతో ఇష్టంగా లాగించేసింది. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/01/Chinese-woman-eating-bat-at-restaurant-గబ్బిలాన్ని-తినేసిన-అమ్మాయి!--jpg"/అయితే గబ్బిలం మాంసం తో పాటు దాని చర్మాన్ని కూడా తినే ప్రయత్నం చేసింది కానీ, చర్మం తినకూడదు అని పక్కనే ఉన్న వ్యక్తి చెప్పడం తో కొంచం ఆగింది.
మొత్తానికి ఒకపక్క చైనా లో ఈ కరోనా వైరస్ తో ఇప్పటికే 17 మంది మృతి చెందగా మరో 600 మందికి ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తుంది.
మరి ఇంత స్పష్టంగా పాము,గబ్బిలాల వల్లే ఈ వైరస్ సోకుతుంది అని అంత క్లియర్ గా చెబుతున్నప్పటికీ ఈ అమ్మాయి మాత్రం ఇలా గబ్బిలం తినడం తో అందరూ దిగ్బ్రాంతి చెందుతున్నారు.
చాపకింద నీరులా హెచ్‌ఎమ్‌పీవీ కేసులు.. భారత్‌లో 18కి చేరిన రోగుల సంఖ్య