షెన్‌జెన్ స్టేషన్‌లో మహిళ నిర్వాకం.. స్నేహితుల కోసం ఏకంగా రైలు డోర్‌నే అడ్డగించింది?

చైనాలోని షెన్‌జెన్ రైల్వే స్టేషన్‌లో( Shenzhen Railway Station ) జరిగిన ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఒక 43 ఏళ్ల చైనీస్ మహిళ( Chinese Woman ) తన స్నేహితులు ట్రైన్ ఎక్కడం కోసం ఏకంగా రైలు డోర్‌నే అడ్డగించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, విపరీతమైన విమర్శలకు దారితీస్తోంది.

వీడియోలో ఆమె ట్రైన్ డోర్ ముందు గట్టిగా నిల్చుని, తన శరీరాన్ని అడ్డుగా పెట్టి డోర్లు మూసుకోకుండా ఆపడం స్పష్టంగా కనిపిస్తోంది.

అంతేకాదు, బయట ఉన్న తన స్నేహితులను( Friends ) తొందరగా రమ్మంటూ చేతులతో సైగలు కూడా చేసింది.

స్టేషన్ సిబ్బంది, అక్కడున్న రైల్వే అధికారులు ఆమెను డోర్ తీయమని పదే పదే కోరారు.

కానీ ఆమె ఎంత చెప్పినా వినకుండా మొండిగా ప్రవర్తించింది.వారిపైకి దుసుకెళ్లే ప్రయత్నం చేయడమే కాకుండా, చాలా మామూలుగా తన ఫోన్ చెక్ చేసుకుంది.

ట్రైన్‌కు ఎలాంటి ఆలస్యం జరగకుండా ఆమెను లోపలికి నెట్టి డోర్లు మూసేయడానికి అధికారులు ఎంత ప్రయత్నించినా, ఆమె మాత్రం డోర్‌ను వదిలిపెట్టలేదు.

"""/" / చాలాసేపు పోరాడిన తర్వాత, చివరికి ఆమె స్నేహితులు రైలు ఎక్కగలిగారు.

అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవడంతో ట్రైన్ అనుకున్న సమయానికే ఆలస్యం లేకుండా బయలుదేరింది.

కానీ, తన నిర్వాకానికి ఆ మహిళకు తగిన శిక్ష తప్పలేదు.తర్వాత, రైల్వే అధికారులు ఆమెను జియామెన్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

రైలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు ఆమెను నిర్బంధించినట్లు తెలిపారు.చైనాలోని కఠినమైన రవాణా చట్టాల ప్రకారం ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.

ప్రయాణికుల భద్రత, రైళ్లు సరైన సమయానికి నడవడంపై ఈ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి.

"""/" / ఈ ఘటనకు సంబంధించిన వీడియో చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో క్షణాల్లో వైరల్ అయింది.

ఆమె చర్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.ఆమె స్వార్థపూరిత చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలా చేయడం వల్ల ఇతరుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లడమే కాకుండా, తీవ్రమైన ఆలస్యం జరిగే అవకాశం ఉందని వాపోయారు.

అదే సమయంలో, మహిళ ఎంత మొండిగా ప్రవర్తించినా, పరిస్థితిని చాలా ప్రొఫెషనల్‌గా, ఓపికగా హ్యాండిల్ చేసిన రైల్వే అధికారులను, సిబ్బందిని కూడా నెటిజన్లు ప్రశంసించారు.

ప్రజా రవాణా వ్యవస్థ సక్రమంగా, సురక్షితంగా పనిచేయడానికి ఆటంకం కలిగించే ఎలాంటి చర్యలనైనా చైనా అధికారులు ఎంత తీవ్రంగా పరిగణిస్తారో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తుంది.

భద్రతా నిబంధనలు, నియమాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలనేందుకు ఇది ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తుంది.